వేంపల్లె :జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న కడప టిడిపి పార్లమెంట్ అభ్యర్థి చదిపిరాళ్ళ భూపేష్ రెడ్డి ని వేంపల్లె టిడిపి యువ నాయకులు కలిసి శాలువాతో సత్కరించారు. వేంపల్లెకు చెందిన యాసిన్, సురేంద్ర, గంగాధర్, వేణుగోపాల్ యవ నాయకులు కలిశారు. పార్లమెంటు అభ్యర్థిగా ఎంపికైనందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. టిడిపి పార్టీ గెలుపు కోసం ప్రతి యవకుడు కష్ట పడి పని చేయాలని ఎంపి అభ్యర్థి భూపేష్ రెడ్డి చెప్పినట్లు వారు తెలిపారు. టిడిపి పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య కూడ తీరుతుందని చెప్పారు.