కుక్కునూరు :పోలవరం ప్రాజెక్టు భూ పరిహారం పొందిన భూములను అర్హులైన పేదలకు ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి ఎర్రంశెట్టి నాగేందర్రావు డిమాండ్ చేశారు బుధవారం నాడు ధవలేశ్వరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అధికారికి మరియు కె ఆర్ పురం ఐటీడీఏ పీవో సూర్య తేజాలకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా నాగేంద్రరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసి భూములు ఇచ్చి ప్రాజెక్టుకు సహకరిస్తున్న కుక్కునూరు మండల నిర్వాసితులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మండలంలో ఎకరాకు పది లక్షల రూపాయలు చొప్పున సుమారుగా 8 సంవత్సరాల క్రితం అర్హులైన వారికి ప్రభుత్వం వారి యొక్క ఖాతాల్లో నష్టపరిహారం జమ చేసింది ప్రభుత్వం వ్యక్తిగత ప్యాకేజ్ చెల్లించకపోవడం వలన నిర్వాసితులు అందరూ ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు కొంతమంది ఈ నష్టపరిహారంతో వేరే చోట భూమిని కూడా కొనుక్కున్నారు కానీ కుక్కునూరు మండలంలో పరిహారం పొందిన భూమిని ఇక్కడ ఉన్న రైతులకు కౌలుకి ఇస్తున్నారు ఆ కవులు కూడా అందని ద్రాక్ష వలె పలుకుతుంది ఎకరాకు సుమారుగా 50వేల నుండి లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నారు ఇక్కడ రైతులు వేరే ఉపాధి లేక దిక్కుతోచని పరిస్థితుల్లో అంత కవులు చెల్లించి వ్యవసాయం చేసి వరదలు వలన నష్టపోయి అప్పుల పాలవుతున్నారు కొంతమంది అంత ధరల పెట్టి వ్యవసాయం చేయలేక కూలి పనికి వెళుతున్న పరిస్థితి ఏర్పడింది కానీ భూమి లేక వ్యక్తిగత పరిహారం లేక ఉపాధి లేక నిర్వాసితులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని కావున నిర్వాసితులకు పరిహారమిచ్చి తరలించేంతవరకు నష్టపరిహారం పొందిన భూములను భూమిలేని పేదలకు పంచి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు జరిగేలా మరియు మొదటి కాంటూరులో తరలించే అన్ని గ్రామాలకు పూర్తి పరిహారం చెల్లించాలని కుక్కునూరు మండలంలో ముంపు లేని గ్రామాలకి వాటర్ ట్యాంకులను పైపులైన్లను మంజూరు చేయాలని కోరారు 41.15 కాంటూరు లో ఉన్న ఆరు గ్రామాలకు మాత్రం పైపులైన్లు బోర్లు మంజూరు లేదు ముంపు పేరుతో గ్రామాల నుంచి తరలించేదాకా అన్ని సౌకర్యాలు కల్పించాలని కొత్తూరు నిర్వాసితులకు మర్రిపాడు లో వారికి కేటాయించిన ఇళ్లను వారికే కేటాయింపు చేయాలని లేదంటే పరిహారం పొందిన భూముల్లో జండాలు పెట్టి గిరిజనులకు పంచుతామని మర్రిపాడు ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇల్లలకు వెళ్లి నిర్వాసితులకు ఇస్తామని నాగేందర్ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సాయికిరణ్ నిర్వాసితులు కే నరసింహారావు సోడే సత్యవతి సరియం హరినాథ్ మీడియం తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు