ఏపీలో ఇవాళ వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జగన్ కేబినెట్లోని మంత్రులంతా ఓటమి బాటలో ఉన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేసిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మినహా మిగిలిన మంత్రులంతా వెనుకంజలో ఉన్నారు. ఆయా స్ధానాల్లో టీడీపీ అభ్యర్ధులు చాలా ముందంజలో కనిపిస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే జగన్ కేబినెట్ అంతా దాదాపుగా ఓటమి పాలైనట్లే భావిస్తున్నారు.రాష్ట్రంలో గత ఐదేళ్లలో వైఎస్ జగన్ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో అత్యధికులు ఓటమి బాటలో ఉన్నారు. వీరిలో శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులు ప్రసాదరావు, కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాస్, కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, కొడాలి నాని, ఆళ్ల నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, విడదల రజనీ, అంబటి రాంబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉషశ్రీ చరణ్, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా సహా పలువురు వెనుకంజలో ఉన్నారు.రాష్ట్రంలో కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో జగన్ కేబినెట్లో పనిచేసిన కొందరు మంత్రులు మాత్రం లీడ్ లో ఉన్నారు. వీరిలో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి, చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మాత్రం లీడ్ లో ఉండటం వైసీపీకి ఊరటనిస్తోంది. మిగిలిన వారంతా ఓటమిబాటలోనే ఉన్నారు.