Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుబూత్ స్థాయినుండి వైసీపీ విజయానికి కృషి చేయాలికాకినాడ ఎంపీ గీత

బూత్ స్థాయినుండి వైసీపీ విజయానికి కృషి చేయాలికాకినాడ ఎంపీ గీత

గొల్లప్రోలు:  రాబోయే ఎన్నికలలో వైసీపీ విజయానికి నాయకులు, కార్యకర్తలు బూత్ స్థాయి నుండి ప్రణాళిక రూపొందించి కృషి చేయాలని  కాకినాడ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ వంగా గీతా విశ్వనాథ్ కోరారు. గొల్లప్రోలు లోని సత్య కృష్ణ ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమావేశానికి ఎంపీ గీత అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ విచ్చేశారు. ఈ సమావేశంలో ఎంపీ గీత మాట్లాడుతూ పార్టీ విజయానికి కార్యకర్తలు నాయకులు కృషి చేస్తే నియోజకవర్గ అభివృద్ధిని తాను చూసుకుంటానని తెలిపారు.వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి వివరించే బాధ్యత బూత్ కన్వీనర్లదే నన్నారు. ఎంపీ అభ్యర్థి సునీల్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దే అన్నారు. మరో 45 రోజులు,ప్రతి కార్యకర్త,  నాయకులు కష్టపడితే విజయం వైసీపీ దే అన్నారు. అంతకుముందు ఆయా గ్రామాలకు చెందిన నాయకులు మాట్లాడుతూ పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఐ ప్యాక్ బృందం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సందీప్ మాట్లాడుతూ బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు తమ పరిధిలోని ప్రతి గృహాన్ని సందర్శించి వైసీపీకి ఓటు పడే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పిఠాపురం వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ మొగలి విమల బాబ్జి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు బుర్రా అనుబాబు, జడ్పీటీసీ ఉలవకాయ లోవరాజు, గొల్లప్రోలు సొసైటీ అధ్యక్షుడు జ్యోతుల భీముడు,మండల వైసీపీ అధ్యక్షుడు అరిగెల రామన్న దొర, అన్నవరం దేవస్థానం పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు మొగలి అయ్యారావు, పట్టణ సచివాలయాల వార్డు కన్వీనర్ల కమిటీ చైర్మన్ మొగలి సాంబశివ, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు గౌతు నాగు, మాజీ జడ్పీటీసీ జవ్వాది కృష్ణ మాధవరావు, నాయకులు గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి, గండేపల్లి బాబి, ఆనాల సుదర్శన్, కొత్తపల్లి బుజ్జి, బాలిపల్లి రాంబాబు, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article