బుట్టాయగూడెం.
బుట్టాయిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా కలగర బాబు (నాని) నియమితులయ్యారు. బుట్టాయగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో నాని పిఎసిఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు పిఎసిఎస్ అధ్యక్షుడిగా ఆరేటి సత్యనారాయణ బాధ్యతలు నిర్వహించారు. పిఎసిఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కలగర నాని మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కోరం దుర్గారావు, రేపాకుల చంద్రం, చిట్టి రాజు, గాడి వెంకటరెడ్డి, అనుపోజు మురళి, తెల్లం చిన్నారావ్, నక్కా శివాజీ, ఈద మధు, దినేష్, సత్య ప్రకాష్, కుక్కల లక్ష్మణరావు, సహకార సంఘం డైరెక్టర్లు, సొసైటీ కార్యదర్శి కరాటం నాగేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.