Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుబాల రాముడి విగ్రహం విశేషాలు

బాల రాముడి విగ్రహం విశేషాలు

అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. రామమందిరంలో బాల రాముడు కొలువుదీరాడు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య, ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రతువును పూర్తిచేశారు. 

బాల రాముడి విగ్రహానికి సంబంధించిన కొన్ని విశేషాలు..

  • నల్లరాతిపై చెక్కిన బాల రాముడి ప్రతిమ ఇది. నీలమేఘ శ్యాముడంటూ రామాయణంలోని వర్ణనకు అనుగుణంగా ఈ రాతిని ఎంచుకున్నారు.
  • బాల రాముడి విగ్రహాన్ని స్వర్ణ, వజ్రాభరణాలతో అలంకరించారు. రాజకుటుంబ ఠీవీని ప్రదర్శించేలా ఆభరణాలతో అలంకరించారు.
  • రాముడిని ఐదేళ్ల బాలుడి రూపానికి తగ్గట్లుగా, ఆ వయసులో కనిపించే అమాయకత్వం ఉట్టిపడేలాగా తీర్చిదిద్దారు.
  • ఐదేళ్ల బాలుడి ఎత్తుకు కాస్త అటూఇటుగా 51 ఇంచుల విగ్రహం ఇది.
  • స్వచ్ఛమైన బంగారంతో విల్లంబులు తయారుచేసి బాల రాముడి చేతిలో అలంకరించారు.
  • రాముడు ఆజానుబాహుడని రామాయణంలో వర్ణించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకగా బాల రాముడి చేతులను పొడవుగా, మోకాళ్ల వరకు చేరేంత పొడవుతో తీర్చిదిద్దారు. ఓ చేతిలో బాణం పట్టుకుని, మరో చేతితో ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో విగ్రహాన్ని మలిచారు.
  • రామాయణంలో శ్రీరాముడి వర్ణనను దృష్టిలో ఉంచుకుని ఈ విగ్రహానికి రూపమిచ్చారు. అందుకే బాల రాముడి కళ్లు పద్మాలను పోలినట్లు కనిపిస్తున్నాయి.
  • బాల రాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దినది కర్ణాటకకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article