Tuesday, May 6, 2025

Creating liberating content

తాజా వార్తలుబాగా చదవాలి.. తల్లి దండ్రులు గర్వపడేలా ఎదగాలి..!

బాగా చదవాలి.. తల్లి దండ్రులు గర్వపడేలా ఎదగాలి..!

  • విద్యారంగంలో ఆంద్రప్రదేశ్ దేశానికి ఆదర్శం
  • జగనన్న స్ఫూర్తి, ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆశీస్సులతో పుస్తకాలు పంపిణీ
  • చెవిరెడ్డి ధ్యానేష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు

రామచంద్రపురం

బాగా చదవాలి.. చదువుకున్న తెలివితో మంచి ఉద్యోగం చేతబట్టి సమాజానికి మంచి చేస్తూ కన్న తల్లి దండ్రులు గర్వ పడేలా ఎదగాలి.. అప్పుడే మనం చదివిన చదువుకు సార్థకత చేకూరుతుంది.” అంటూ చెవిరెడ్డి ద్యానేష రెడ్డి

రామచంద్రపురం మండలం కుప్పం బాదురు, రాయల చెరువు, మిట్ట కండ్రిగ, సికేపల్లి, నెత్త కుప్పం, అనుపల్లి పంచాయతీల పరిధిలోని 19 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 714 విద్యార్థులకు నోటు పుస్తకాలు, రైటింగ్ ప్యాడ్స్, బ్రెయిన్ ఎక్సర్ సైజ్ ఫజిల్ షీట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ విద్యా రంగంలో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిన జగనన్న పరిపాలనను స్ఫూర్తిగా తీసుకుని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆశీస్సులతో ఈ బృహత్తర కార్యక్రమంను చేపట్టినట్లు తెలిపారు. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణం లో నోటు పుస్తకాలు పంపిణీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు బాధ్యతగా హాజరవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుజనా కుమారి, జిల్లా వ్యవసాయ అద్వైజరి కమిటీ చైర్మన్ రఘునాథరెడ్డి, ఎంపీపీ బ్రహ్మానంద రెడ్డి, జడ్పిటిసి ఢిల్లీలోని భాను కుమార్ రెడ్డి, మండల కన్వీనర్ ఎద్దల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ దామోదర్ రెడ్డి, ఎంపీటీసీలు కృష్ణవేణి, చంద్రశేఖర్ రెడ్డి, రాజేష్, నాయకులు యశ్వంత్ రెడ్డి, బికి రెడ్డి, పాఠశాల తల్లిదండ్రులకు చైర్మన్ సురేష్ , సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు , తల్లిదండ్రులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article