కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహమ్మద్ అలి
చింతూరు:భారతదేశ ఆరవ ప్రధానిగా దేశానికి సేవలందించిన రాజీవ్ గాంధీ పేద,బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆశేషమైన కృషి చేశారని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ఆ పార్టీ సీనియర్ నేత అహమ్మద్ అలి స్పష్టంచేశారు. మంగళవారం రాజీవ్ గాంధీ 33.వ వర్ధంతిని పురస్కరించుకొని, కాంగ్రెస్ నాయకులు, కార్యాకర్తలు దివంగత నేత రాజీవ్ కు ఘనంగా నివాళలు అర్పించారు. మూడు రోడ్ల కూడలిలోగల రాజీవ్ గాంధీ విగ్రహానికి అహమ్మద్ అలీ పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అహమ్మద్ అలి మాట్లాడారు. రాజీవ్ గాంధీ తన పదవీ కాలంలో దేశంలో మొట్ట మొదటి సారిగా, టెలి కమ్యూనికేషన్, ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీని తీసుకొని వచ్చారన్నారు. అంతే కాకుండ అనేక కొత్త సంస్కరణలు తీసుకొని వచ్చి, వాటిని అమలు చేశారని, వారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మాజీ ఎంపిటిసి కృష్ణమూర్తి, మధు, బొక్కిలి ప్రసాద్, సోడి రామకృష్ణ, శ్రీను ,షేక్ అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు.