నిరుద్యోగ అభ్యర్థులకు యుటిఎఫ్ పిలుపు…
తుని
ఫిబ్రవరి 4 ఆదివారం సాయంత్రం 4 గం నుండి 7 గం వరకు కాకినాడ అంబేడ్కర్ భవన్ లో గ్రూప్స్ మరియు డివైఈఓ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఉచిత అవగాహన సదస్సు జయప్రదం చేయాలని యుటిఎఫ్ తుని పట్టణ శాఖ తెలిపింది.
ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కె సురేష్, యుటిఎఫ్ తుని పట్టణ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి బ్రహ్మనాయుడు, ఎన్ వీరబాబు లు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ పోటీ పరీక్షల కోచింగ్ నిపుణులు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సారధ్యంలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు (ఐవి) ఆధ్వర్యంలో యుటిఎఫ్, జెవివి, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాలు ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రూప్స్ మరియు డివైఈఓ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఫిబ్రవరి 4 ఆదివారం సాయంత్రం 4 గం నుండి 7 గం కు కాకినాడ అంబేడ్కర్ భవన్ కి రావాలన్నారు. సదస్సు అనంతరం భారత సమాజం, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తామన్నారు. కావున గ్రూప్స్ మరియు డివైఈఓ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఫిబ్రవరి 4 వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గం కు కాకినాడ పాత బస్టాండ్ లో గల అంబేడ్కర్ భవన్ కి చేరుకోవాలని తెలిపారు