Sunday, November 9, 2025

Creating liberating content

టాప్ న్యూస్ప్రైవేట్ కోరల్లో శిల్పారామం!

ప్రైవేట్ కోరల్లో శిల్పారామం!

  • లీజుల పేరిట ప్రభుత్వ భూముల దోపిడీ
  • ఎంత కట్టుకుంటే అంత ఇస్తారు” అంటున్న అధికారులు!

ప్రజాభూమి ప్రత్యేకప్రతినిధి(తురక అమరనాథ్) – తిరుపతి

తిరుమల విశిష్టతతో అంతర్జాతీయ ప్రాధాన్యం పొందుతున్న పవిత్ర క్షేత్రం, టెంపుల్ సిటీ తిరుపతి నగరం రోజు రోజుకూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నప్పటికీ, మరోవైపు ప్రభుత్వ భూములపై ప్రైవేటు ఆక్రమణలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోట్లు కోట్లు విలువైన ప్రభుత్వ భూములు కొందరు ప్రవేట్ వ్యక్తుల కోరల్లోకి జారిపోతూ, అధికారులు కళ్లుమూసి చూడటం నగర ప్రజల్లో చర్చనీయాంశమైంది. తిరుచానూరులోని శిల్పారామం గతంలో తిరుచానూరు పెద్ద చెరువు వందల ఎకరాలు పంటలకు నీరు సరఫరా చేసిన ఘనత ఈ చెరువుది. నగరం విస్తరిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో హస్తకళల ప్రోత్సాహానికి ప్రతీకగా శిల్పారామంను స్థాపించిన తిరుమల సందర్శనకు వచ్చే భక్తులు తిరుపతి నగర ప్రజలు ఆహ్లాదకరంగా వీక్షించేందుకు అనుగుణంగా శిల్పారామంను నెలకొల్పారు. ఆ ప్రాంగణం ప్రస్తుతం ప్రైవేటు సంస్థల ‘లాభ కేంద్రంగా’ మారిపోతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కట్టిన ఈ శిల్పారామం భూమిని లీజు పేరుతో ప్రైవేటు సంస్థలకు ఇచ్చి, ఆ పరిమితులు దాటి నిర్మాణాలు సాగుతున్నా తమకేమీ కనిపించలేదు అనే విధంగా వ్యవహరిస్తున్నారు.

లీజు పరిమితిని మించి నిర్మాణాలు!

సమాచారం మేరకు ఐదు సంవత్సరాల లీజు కాలానికి “లావణ్య ఫోటో ప్రేమ్” అనే ప్రైవేటు సంస్థకు శిల్పారామంలో స్థలం కేటాయించబడింది. కానీ ఆ సంస్థ ఇచ్చిన పరిమితికి మించి నిర్మాణాలు చేపడుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ప్రజాభూమి ప్రతినిధి శిల్పారామం సీఈఓ స్వామి నాయుడు ని ఫోన్ ద్వారా సంప్రదించగా, ఆయన “మేము లీజుకు ఇచ్చాం, వారు ఎంత కట్టుకుంటే అంత మాకు డబ్బులు ఇస్తారు” అని నిర్లక్ష్య ధోరణితో సమాధానం ఇచ్చి ఫోన్ కట్ చేశారు. ఒక మీడియా ప్రతినిధిగా వివరణ కోరితేనె అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తి సామాన్య ప్రజలతో ఎలా వ్యవహరిస్తారో ఊహకందని పరిస్థితి.

హస్తకళలకు కేటాయించిన స్థలాలు – ప్రైవేటుల చేతుల్లోకి!

ప్రభుత్వం శిల్పారామాన్ని స్థాపించిన ఉద్దేశ్యం స్థానిక హస్తకళాకారులను ప్రోత్సహించడం. అయితే వారిని విస్మరించి, వాణిజ్య లాభాల కోసం ప్రైవేటు సంస్థలకు స్థలాలు ఇవ్వడం పట్ల కళాకారుల వర్గం తీవ్రంగా స్పందిస్తోంది. హస్తకళల కోసం కేటాయించిన భూములు లాభాల కోసం ఉపయోగిస్తే ప్రభుత్వ సంకల్పం ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు.

ప్రజా ఆస్తులపై మోసపూరిత లావాదేవీలు?

ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు లబ్ధిదారుల చేతుల్లోకి ప్రభుత్వ భూములు వెళ్ళేలా ప్రణాళికాబద్ధంగా ఒప్పందాలు కుదుర్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనల్ని ఎవరు అడుగుతారు? అనే ధీమాతో అధికారులు వ్యవహరిస్తున్న తీరు తిరుపతి ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతోంది.

ప్రవేట్ వ్యక్తుల ప్రభుత్వ భూములు ధరాదత్తం చేస్తే చేస్తే భవిష్యత్ తరాలకు ఏమి మిగులుస్తారు?

ప్రజల ఆస్తి, ప్రభుత్వ భూములు ఇలా ప్రైవేటులకే దారదత్తం చేస్తే భవిష్యత్ తరాలకు ఏమి మిగులుస్తారు? అని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి లాభాల కోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలపడం పట్ల అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article