ప్రశాంత వాతావరణం కల్పించేందుకు 34,ఆక్ట్ 144 సెక్షన్అమ్ములు.
ఎన్నికల స్పెషలాఫీసర్ కడప డిఎస్పి రమాకాంత్
ఒంటిమిట్ట:
సోమవారం నాడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్ బూత్ల వద్దకు చేరుకొని ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికలకు 48గంటలకు ముందు 34 యాక్ట్, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు పాల్పడిన ఉపేక్షించేది లేదని ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ కడప డిఎస్పి రమాకాంత్ అన్నారు,శుక్రవారం నాడు స్థానిక సర్కిల్ కార్యాలయంలో సిఐ పురుషోత్తం రాజుతో కలిసి పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల రోజు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ప్రతి ఒక్కరు సెల్ఫోన్ పోలింగ్ బూత్ లకు తీసుకువెళ్లడం నిషేధమని, ఏవీఎంలను వీడియో తీయడం ఓటు వేసిన ఫోటో తీయడం ఏవీఎంలను తాకడం లాంటి దుశ్చర్యలకు పాల్పడకూడదని అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.ఓటు వేసినా వెంటనే తమ తమ ఇండ్లకు చేరుకోవాలని సూచించారు గుంపుల గుంపులుగా చర్చించుకోవడం చట్ట విరుద్ధమని ఆయన అన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేసిన,ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిన, అట్టి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్నారు ఎన్నికలు ముగిసే వరకు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక పోలీసుల నిఘా ఉంటుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్సై మధుసూదన్ రావు. సిద్ధవటం ఎస్సై పెద్ద ఓబన్న, స్థానిక పోలీసులు స్పెషల్ పార్టీ సిఆర్పిఎఫ్, కె ఆర్ పోలీసులు ప్రత్యేక బలగాలు,పాల్గొన్నారు.