అనంతపురము :గుత్తి పట్లణంలో ప్రభుత్వ గురుకుల, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలని
హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, బి.మోహన్ నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం గుత్తిలోని ప్రభుత్వ బి.సి. హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ గురుకుల, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనాలు పాతబడిపోయాయని, వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలని, అలాగే మౌళిక వసతుల కల్పించాలని, కొన్ని భవనాల్లో గదులు, కిటికీలు, డ్తెనింగ్ హాల్ ప్రహరీ గోడ, బాత్ రూమ్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ప్రహరీ గోడ లేక పోవడం వల్ల హాస్టల్లోకి పందులు, కుక్కలు, ఆవులు చొరబడుతున్నాయని, తద్వారా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. గుత్తిలో బాలికల కాలేజీ లేనందున విద్యార్థినులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, విద్యార్థినులకు కొత్త భవనం ఏర్పాటు చేసి హాస్టల్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు
హరిత దివ్యాంగుల సేవా సమితి పాల్గొన్నారు.

