మార్కాపురం
మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోమునగాల చంద్రశేఖర్ రెడ్డి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు అందుకున్న సందర్భంగా 27 బ్లాక్ కౌన్సిలర్ కసెట్టినగేష్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంకు 50 వేల రూపాయల నగదును పాఠశాల అభివృద్ధి నిమిత్తం అందజేస్తారని వాగ్దానం చేశారు ఈ సన్మాన కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా వాణి విభాగ అధ్యక్షులు తడికమల బాల సుబ్బారావు, కాంట్రాక్టర్ దాసరి వెంకటేశ్వర్లు, 31 బ్లాక్ నాయకులు మహమ్మద్, 16 బ్లాక్ కౌన్సిలర్ హర్షిత బాబి తదితరులు పాల్గొన్నారు

