శంఖవరం: ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దివంగత నేత పర్వత శ్రీ సత్యనారాయణ మూర్తి (చిట్టిబాబు) భౌతికంగా దూరమై 8 ఏళ్లయినప్పటికి నేటికి ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని శంఖవరం ఎంపీపీ పర్వత రాజబాబు అన్నారు. మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ స్వగృహంలో చిట్టిబాబు 8 వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా చిట్టిబాబు చిత్రపటాన్ని కి మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ, రాజబాబు, జానకిదేవి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రాజబాబు మాట్లాడుతూ దివంగత నేత పర్వత చిట్టిబాబు తన పదవికాలం అంతా ప్రజల మధ్యే ఉంటూ మీ అందరితోనే నేను కూడా అనే రీతిలో సమాజంలో కలిసిన నేత అని కొనియాడారు. చిట్టిబాబు ఎమ్మెల్యే కొనసాగిన సమయంలో చేపట్టిన అభివృద్ధి నేటికీ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారన్నారు. అనంతరం వికలాంగులకు, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పడాల దొంగబాబు, పర్వత సత్యనారాయణ మూర్తి, పర్వత వివేకానంద, పర్వత చంటిబాబు, బొమ్మిడి చిట్టిబాబు, అడపా దొంగబాబు, పిల్లా గంగాధర్, ఆచంట వెంకటేశ్వరరావు, పడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
