అండగా వైసిపి ప్రభుత్వం
రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ లో కొందరు చీడపురుగులు
ఒంటిమిట్ట;
రాష్ట్రంలో బ్రాహ్మణుల శ్రేయస్సు కోసం వారి ఎదుగుదల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే బ్రాహ్మణులకు దక్కవలసిన పథకాలు అమలులో కానీ కార్పొరేషన్ లో రుణాలు ఇచ్చేటువంటి వాటిలో కానీ కొందరు చీడపురుగులు అడ్డపడి తమదైన తెలివితేటలతో తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారన్న వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి బ్రాహ్మణులకు దైవ నామస్మరణ ఆలయాలలో అర్చకులు జీతభత్యాలు తో జీవితాలు గడపడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది అయితే వారు కార్పొరేషన్ లో ఇంటి రుణాల పైన మరియు స్థలాల పైన లోన్లు మంజూరు చేయించుకుని సరైన సమయానికి బకాయిలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే ప్రైవేట్ కార్పొరేషన్ల వారిపై వడ్డీలు విపరీతంగా వేయడం వారి కుటుంబాలపై విపరీతమైనటువంటి వెతలు పెట్టి వారిని భయపెట్టి బకాయిలు కడతారా లేక మీ ఆస్తులు జప్తు చేస్తాము అంటూ బెదిరింపులకు పాల్గొనడం చాలా బాధాకరం బ్రాహ్మణులపై కార్పొరేషన్ స్థాయి అధికారులు ఇప్పటికైనా మేల్కొని సంబంధిత బకాయిదారులకు గడువును ఇచ్చి వారి స్థితిగతులు తెలుసుకొని వారికి న్యాయం చేసే దిశగా చేయాలని కార్పొరేషన్ లో తీసుకున్న రుణ గ్రహీతలు వేడుకోలు చేసుకుంటూ ఉన్నారు ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదిక పంపనున్నట్లు వారు తెలిపారు రాబోయే రోజులలో రాష్ట్ర లో వైఎస్ఆర్సిపి మరల అధికారంలోకి రావడం ఖాయమని బ్రాహ్మణుల అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వ్యక్తులకు కార్పొరేషన్ చోటు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు మరియు పేద బ్రాహ్మణులు జగన్మోహన్ రెడ్డికి పత్రికాముఖంగా విన్నపం చేశారు.
