హిందూపురం టౌన్
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలంటే విద్యార్థినులు పోటీ పరీక్షలలో సత్తా చాటాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రగతి, హైదరాబాద్ ఆప్టిక్ జాబ్స్ కు చెందినఅధ్యాపకులు నారాయణ, సాయి వివేక్ లు సూచించారు. ఏపీపీఎస్సీ, ఇతరపోటీ పరీక్షల కోసం సన్నద్ధతపై శుక్రవారం స్థానిక కళాశాలలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, డిగ్రీ విద్యార్థులకు అందుబాటులో
ఉన్న ఉద్యోగ అవకాశాలు. వాటిని అందుకోవటానికి కళాశాల అందిస్తున్న సదుపాయాలను వివరించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ -1 లో ఎనిమిదవ ర్యాంకు పొంది డిప్యూటీ కలెక్టర్ ఎంపికయిన కళాశాల పూర్వ విద్యార్ధిని స్వాతి స్ఫూర్తితో విద్యార్థినులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో రాణించాలని సూచించారు. అప్టిక్ జాబ్స్ అధ్యాపకులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాల ప్రాధాన్యతలను వివరిస్తూ పోటీ పరీక్షల సన్నద్ధతకు అవసరమైన ప్రామాణిక స్టడీ మెటీరియల్ సేకరణ, ప్రిపరేషన్ వివరాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, అకాడమీ కోఆర్డినేటర్ శ్రీధర్, కెరీర్ గైడెన్స్ సమన్వయకర్త రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.