Sunday, November 9, 2025

Creating liberating content

టాప్ న్యూస్పేరు గొప్ప ఊరు దిబ్బ….

పేరు గొప్ప ఊరు దిబ్బ….

  • సూళ్లూరుపేటకు ఒక వైపు శ్రీహరికోట అంతరిక్షకేంద్రం
  • మరోవైపు శ్రీసిటీ, మాంబట్టు పారిశ్రామిక వాడలు
  • పేటలో ఎమ్మెల్యేలు మారుతున్నా
  • మారని పట్టణ వాసులు బ్రతుకులు
  • ఏళ్ల తరబడి తీరని తాగు నీటి కష్టాలు
  • మురికి వాడల్లా పట్టణ విధిలు

(పి శ్రీరామచంద్ర మూర్తి సూళ్లూరుపేట టౌన్ ప్రతినిధి )

సూళ్లూరుపేట పట్టణం పేరు చెబితే అంతరిక్ష చరిత్ర గుర్తొచ్చే ఊరు. ఒక వైపు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం, మరోవైపు శ్రీసిటీ, మాంబట్టు పరిశ్రామిక వాడలు, చుట్టూ ఉద్యోగాలు, ప్రాజెక్టులు, పరిశ్రమల సందడి… కానీ మధ్యలో ఉన్న ఈ పట్టణం మాత్రం అభివృద్ధి దరిదాపుల్లోకి రాని దుస్థితిలో ఉంది. రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నా…అభివృద్ధిలో వెనుకబడిన పట్టణం సూళ్లూరుపేట పేరు దేశవ్యాప్తంగా ప్రతిష్ట పొందింది. ఇక్కడి నుంచి చంద్రయానాలు, రాకెట్ ప్రయోగాలు సాగుతుంటే, సమీపంలోని పులికాట్ సరస్సులో విదేశీ పక్షులు విహరిస్తుంటాయి. పరిశ్రమల వృద్ధిలో శ్రీసిటీ పాత్ర చెప్పనవసరం లేదు. కానీ ఈ ప్రాధాన్యత నిండిన ప్రాంతం మధ్యలో ఉన్న పట్టణం మాత్రం తాగునీరు కోసం, రోడ్ల కోసం, శుభ్రత కోసం ఇబ్బంది పడుతోంది

ఇంకా పూర్తి వివరాలోకి వెళ్ళితే…

ప్రధానంగా సూళ్లూరుపేట పట్టణంలో నీటి కష్టాలు ఎప్పుడు తొలిగేను. ఎన్నోసార్లు మొర పెట్టుకున్నా స్పందనలేని అధికారులు, నాయకులు. సూళ్లూరుపేట మున్సిపాలిటీ 1వ వార్డు ప్రజల వేదన ఆవేదనగా మారింది
సూళ్లూరుపేట మున్సిపాలిటీ 1వ వార్డు ప్రజల గుండెల్లోంచి వినిపిస్తున్న ఈ మాటలు ఇప్పుడు పట్టణమంతా మార్మోగుతున్నాయి. పన్నులు కడుతున్న ప్రజలకు కనీస వసతులే లేవు. ప్రతి వాన చినుకు పడినా వీధులన్నీ చిత్తడే చిత్తడిగా మారిపోతున్నాయి. తాగునీరు, రోడ్లు వంటి మౌలిక వసతుల లోపంతో జీవనం సవాలుగా మారింది.

నాయకులకు మొరపెట్టుకున్నా స్పందన లేదు

గత కొన్నేళ్లుగా ప్రజలు నాయకుల దగ్గర, అధికారుల దగ్గర తమ సమస్యలు చెబుతూ మొరలు పెట్టుకున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈరోజు నీరు వస్తుంది, రేపు వస్తుంది అంటూ మాటల్లోనే సాంత్వన లభిస్తోంది కానీ, సమస్య పరిష్కారం మాత్రం జరగడం లేదు

పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి… కానీ వసతులు మాత్రం గాలిలో

ఒకప్పుడు పంచాయతీగా ఉన్న ఈ ప్రాంతం చుట్టూ లేఔట్లు అభివృద్ధి చెందడంతో మున్సిపాలిటీలోకి కలిపారు. పేరు మాత్రమే సూళ్లూరుపేట అయినా, పరిస్థితి మాత్రం పేటకీ పక్క ఊరికీ తేడా లేదు అంటున్నారు స్థానికులు. మున్సిపాలిటీలో ప్రధాన వార్డుగా ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం కనపడడంలేదు.

ప్రజల కష్టాలపై రాజకీయ నిశ్శబ్దం

ఈ వార్డులో అన్ని పార్టీలకు చెందిన చిన్నా పెద్దా నాయకులు ఉన్నారు. కానీ ప్రజల సమస్యల విషయానికి వస్తే అందరూ నిశ్శబ్దం. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే వీరు ఓట్లు వేసిన ప్రజలను మరచిపోతున్నారు. ఎన్నికలప్పుడు మాకు మెహర్‌బానీ చూపిస్తారు… గెలిచాక కనపడరే అని ప్రజలు వ్యంగ్యంగా అంటున్నారు.

ఆర్ అండ్ బి పనులు మధ్యలోనే ఆగిపోయాయి

ఆర్ అండ్ బి శాఖ అధికారులు రింగ్రోడ్డుల పేరుతో పెద్ద ఎత్తున పనులు ప్రారంభించారు. కానీ మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు ఆ పనులు చిత్తడులో కలిసిపోయాయి. వర్షం పడితే ప్రజలు బయటకు రావడమే కష్టం. నడవడానికి మార్గం కూడా లేదు.

గెలిచిన కౌన్సిలర్ మాయమయ్యాడు

ఈ వార్డుకు గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్ ప్రజలతో మమకారంగా ఉన్నాడు అనుకున్నారు ఓటర్లు. కానీ గెలిచిన వెంటనే కమర్షియల్ వ్యాపారాల వైపు మళ్లిపోయాడు. ప్రజలు ఇచ్చిన ఓట్లకు కృతజ్ఞత చూపించకుండానే గల్లీ కనపడడం లేదు అని వాపోతున్నారు స్థానికులు.

కాల్వ పూడ్చి లేఔట్‌కి దారి అధికారుల నిర్లక్ష్యం

గత ప్రభుత్వంలో చెరువు కాల్వ పూడ్చి ఓ నాయకుడు వేసిన లేఔట్‌కి రోడ్డు ఏర్పరచుకున్నారు. దీనిపై ఇరిగేషన్ అధికారులు కూడా కనీసం నోటీసు ఇవ్వలేదు. “కాల్వపైనే దారి వేయడం చూసినా ఎవరూ ఆపలేదు” అని ప్రజలు మండిపడుతున్నారు.

నీటి ట్యాంక్ ఉన్నా నీరు లేదు

ఈ వార్డులో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది. నీటి పథకాలు కూడా ఉన్నాయి. కానీ తాగునీటి సరఫరా మాత్రం లేనట్టే. ప్రజలు రోజూ ఊరికి బయటకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. పథకాలు కాగితాల మీదే ఉన్నాయి… చుక్క నీరుకూడా రావడం లేదు” అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వాలు మారినా పేట కష్టాలు మారడం లేదు

ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి అన్న మాట వింటూనే ఉన్నామని, కానీ పేట కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ప్రతి ప్రభుత్వం మాటల్లో మాత్రమే అభివృద్ధి చూపించిందని ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే మేడం స్పందించండి

ప్రజల చివరి ఆశ నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. మేడం… మీరు అయినా మా కష్టాలపై దృష్టి పెట్టండి. తాగునీరు, రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించండి అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article