వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక
హిందూపురంటౌన్ :పేదలు, అవ్వతాతలతో పాటు, వితంతుల పింఛన్ ఇవ్వకుండా టిడిపి నేత చంద్రబాబు అడ్డుకుని తన పెత్తందారీ మనస్తత్వం మరో సారి చూపించారని వైసిపి హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి దీపిక అన్నారు. సోనువారం పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ , ప్రతి నెల 1న వాలంటీర్ లు సూర్యుడు ఉదయించక ముందే తలుపు తట్టి ఫించన్లు అందించే వారన్నారు. అయితే దీనిని సైతం చంద్రబాబు అడ్డుకుని ఈ నెల 1న ఫించన్ అందకుండా చేశారన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఏనాడైనా వృద్ధులకు ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా సీఎం జగనన్న చేసి చూపించారన్నారు. అయితే టిడిపి జన్మభూమి పేరుతో ప్రజా ధనాన్ని దోచుకుంటున్నట్లు ఆమె ఆరోపించారు. ఎన్ని ఎత్తులు వేసినా ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ జగన్న ముఖ్యమంత్రి కావడంతో తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.