పుట్లూరు
అనారోగ్యంతో బాధ పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద ఆర్థిక చేయూతను సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల పరిధిలోని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
బాధిత కుటుంబాలు, వారి ఆర్థిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావటంతో స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 5 కుటుంబాలకు రూ.10.39 లక్షలు మంజూరు చేయించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త యం. వీరాంజనేయులు, రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ సిహెచ్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

