యాజమాన్యాన్ని అభినందించిన ఆప్కాస్ స్టేట్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి
పోరుమామిళ్ల:
పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో మంచి విద్యను అందిస్తున్న వైష్ణవి స్కూల్ యాజమాన్యాన్ని ఆప్కాస్ స్టేట్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అభినందించారు. వైష్ణవి స్కూల్ పదవ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆప్కాస్ స్టేట్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన పోరుమామిళ్లలో 432 మంది విద్యార్థులతో మొదట ప్రారంభించి నేడు 1154 మంది విద్యార్థులు ఉండడం అందుకు కారకులైన కరెస్పాండెంట్ రామకృష్ణ చైర్మన్ రామాంజనేయులు ప్రిన్సిపాల్ కళ్యాణి కృషి అభినందనీయమన్నారు.

అలాగే ఎంఈఓ రత్నస్వామి, ఫైర్ ఆఫీసర్ నజీర్, మాట్లాడుతూ వైష్ణవి స్కూల్ పట్టణానికి దూరంగాఎంతో ఆహ్లాదమైన వాతావరణంలో విద్యార్థులకు బోధనా అందించడం చాలా గొప్పది అన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆప్కా స్టేట్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ని పూలమాల శాల్వా మెమొంటలతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. విద్యార్థులచే నిర్వహించబడిన సాంస్కృతి కార్యక్రమాలు సిని హీరోయిన్ గీత, నటుడు సునీల్ శెట్టి, జబర్దస్త్ కమెడియన్ తదితరులు అందరిని అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.