ప్రజా భూమి కుందుర్పి
పురాతన దేవాలయాలను పరిరక్షించాలని బిజెపి అధ్యక్షుడు వెంకటేష్ దేవాదాయ శాఖకు లేఖను రాశాడు. పురాతన దేవాలయాలను రక్షించాలని మండలంలో ఉన్న మొలైనూర్ గ్రామంలోఅతి పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని తాలూకా మరియు మండల బిజెపి అధ్యక్షులు శనివారం మల్లన్నూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి పురాతన దేవాలయాలను ఎండోమెంట్ శాఖ వారు దత్తత తీసుకొని ఆలయాలను పరిరక్షించాలన్నారు దేవాలయాలలో గుప్త నిధుల కోసం ఈమధ్య ఎక్కువగా పురాతనమైనటువంటి శిల్పాలను పగలగొడుతున్నారని ఆరు ఈ సందర్భంగా ఆరోపించారు. అలాగే మండలంలో ఉన్న పురాతన ఆలయాలను సంరక్షించాలని ఎంపీడీవో లక్ష్మీ నరసింహ గారి లక్ష్మీనరసింహ కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి తాలూకా అధ్యక్షుడు ముప్పూరి దేవరాజ్ అలాగే బిజెపి యువ నాయకుడు తలారి సోము సుబ్రహ్మణ్యం గంగాధర కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు