రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా సినిమాకు సంబంధించి బిగ్ బాస్ సోహైల్ ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. ‘బూట్ కట్ బాలరాజు’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ ‘RC16’ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. “బుచ్చిబాబు అన్న నాకు బాగా క్లోజ్. నేను రెగ్యులర్ గా బుచ్చిబాబు అన్నతో మాట్లాడుతుంటాను. నా సమస్యలు కూడా అన్నకి చెప్పుకుంటాను. ఇండ్రస్ట్రీలో ఆయన నాకు మంచి ఫ్రెండ్. రీసెంట్ గా బుచ్చిబాబు అన్నని కలిశాను. ‘రామ్ చరణ్ గారితో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు, బిగ్ అఛీవ్మెంట్ మీకు ఇది’ అని చెప్పాను. వెంటనే బుచ్చిబాబు అన్న మాట్లాడుతూ ‘పాన్ ఇండియా కాదు… అది పాన్ వరల్డ్ మూవీ’ అని చెప్పారు” అంటూ సోహైల్ అన్నాడు. ఆయన తాజా వ్యాఖ్యలతో ‘RC16’ పై అంచనాలు తారస్థాయికి చేరాయి.
మార్చి రెండో వారంలో షూటింగ్.. సరికొత్త మేకోవర్ తో రామ్ చరణ్
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా ప్రాజెక్టు వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోబోతోంది. మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. కొద్ది రోజుల షూటింగ్ తర్వాత ‘RC16’ నుంచి చిన్న వీడియో గ్లింప్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రపై బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు చెబుతున్నారు.