హిందూపురంటౌన్
హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న పరిపూర్ణానంద స్వామి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లి, విజయనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామికి ఘనంగా స్వాగతం పలికారు. భక్తులతో కలిసి భజన కార్యక్రమాల్లో పరిపూర్ణానంద స్వామి పాల్గొన్నారు. అదే విధంగా రోడ్ షో, ఇంటింటా ప్రచారం నిర్వహించి తనను ఆదరించి గెలిపించాలని తద్వారా హిందూపురం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో స్వామి భక్తులు, మద్దతుదారులు పాల్గొన్నారు.

