ఆదర్శంగా తీర్చిదిద్దడమే పులివర్తి నాని లక్ష్యం..
టీడీపీ యువనేత పులివర్తి వినీల్ వెల్లడి..
చంద్రగిరి:
పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి, ప్రణాళికాబద్ధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కృషి చేస్తారని, టీడీపీ యువనేత పులివర్తి వినీల్ అన్నారు. “మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని”, “బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా మంగళవారం పులివర్తి వినీల్ యర్రావారిపాళెం మండలం, వి.ఆర్.అగ్రహారం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పులివర్తి వినీల్ ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మినీ మేనిఫెస్టో లోని అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివర్తి నాని అధికారం చేపట్టిన వెంటనే తలకోనకు డబుల్ రోడ్డు వేయిస్తారని తెలిపారు. గతంలో మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి తలకోన సిద్దేశ్వర ఆలయం అభివృద్ధికి కృషి చేసిందని చెప్పారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల డికేటి భూములుపై కేసులు వేశారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో డికేటి భూములు రెగ్యులరైజ్ చేసే బాధ్యత పులివర్తి నాని తీసుకుంటారని చెప్పారు. అలాగే అధికారంలోకి వచ్చిన నెలలో ఉపాధి హామీ పనులు ప్రతి రైతుకు వచ్చేలా చేస్తారని చెప్పారు. రాష్ట్రానికి చంద్రగిరి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని చెప్పారు. ఒక్క అవకాశం ఇస్తే నా తండ్రి పులివర్తి నాని ప్రజలకు కుటుంబ సభ్యుడులా అండగా ఉంటారన్నారు.
