ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికలు
హిందూపురం టౌన్ :హిందూపురం న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా ఈ. రాజశేఖర్ ఎన్నికయ్యారు. ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో 4 ఓట్ల మెజార్టీతో రాజశేఖర్ విజయం సాధించారు. ఎన్నికల అధికారి, సీనియర్ న్యాయవాది రామరత్నం శాస్త్రి పర్యవేక్షణలో మంగళవారం బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానానికి న్యాయవాదులు నాగరాజు , హిదయతుల్లాఖాన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ లో మొత్తం 123 మంది ఓటర్లు ఉండగా 110 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రాజశేఖర్ కు 47 ఓట్లు రాగా వన్నెరప్పకు 43, కే హెచ్ గోపాల్ కు 20 ఓట్లు వచ్చాయి. దీంతో రాజశేఖర్ నాలుగు ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం ప్రధాన కార్యదర్శిగా జి. శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మురళి, ఆంజనేయులు, సంతోషి కుమారి, సంయుక్త కార్యదర్శులు గా రత్నమ్మ, హెచ్ కె వెంకటేశ్వరరావు, కోశాధికారిగా ఈశ్వరప్ప, గ్రంథాలయ ఇన్చార్జిగా రవిచంద్ర, మీడియా కోఆర్డినేటర్ గా ఫణి భూషణ్ లను ఎన్నుకున్నారు. అదేవిధంగా రామ రత్నం శాస్త్రి, శ్రీరాములు సిద్దు బీవీ రంగారెడ్డి, నాగభూషణ్ రావు, రామచంద్రారెడ్డి, హిదయతుల్లా ఖాన్, కళావతి లను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.