శ్రీకాకుళం: పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో బాగా యాక్టివ్ అయ్యారు. పీసీసీ అధ్యక్షురాలి హోదాలో జిల్లాల పర్యటన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా షర్మిల మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇచ్ఛాపురంలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించిననంతరం పొందూరు ఖాదీ కార్మికులు, ఉద్దానం కిడ్నీ బాధితులతో సమావేశం కానున్నారు.