అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నేడు జరగనుంది.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం కానుంది రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ.ఈ సమావేశంలో.. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై కీలకంగా చర్చ సాగనుంది.. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాల పైనా ఎస్ఎల్బీసీలో చర్చించే అవకాశం ఉందంటున్నారు.. ఎన్నికల ప్రచార సమయంలో.. ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ అందజేసింది..