ఎంపీడీవో దివిజా సంపతి
వేంపల్లె
నూలి పురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపిడిఓ దివిజా సంపతి అన్నారు. బుధవారం తాళ్ళపల్లె వైద్య ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూలి పురుగుల నివారణకు సంబంధించిన గోడ పత్రాలను ఎంపిడిఓ సభా భవనంలో ఎంపీడీవో దివిజా సంపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ నూలి పురుగుల దినోత్సవం సందర్భంగా అల్బెండాజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 9 వతేది నుండి మండలంలోని ప్రభుత్వ, ప్రయివేటు, కళాశాలు, అంగన్వాడీ పాఠశాల్లో చదివే ప్రతి విద్యార్థి అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేస్తారని కాబట్టి 1-19 వయస్సు కలిగిన విద్యార్థులు అందరూ మాత్రలు మింగాలని కోరారు. అల్బెండాజోల్ మాత్రలు మింగడం వల్ల కడుపులో ఉన్న నూలి పురుగులు లేకుండా పోతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యురాలు స్వాతి సాయి, పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ షఫివున్నిషా బేగం,ఐసిడిఎస్ సూపర్ వైజర్ స్వర్ణలత, సిహెచ్ ఓ బసయ్య, ఎఎన్ఎం శారద పాల్గొన్నారు.