Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలునీటి కోసం ప్రజలు ఆర్తనాదాలు

నీటి కోసం ప్రజలు ఆర్తనాదాలు

పశ్చిమ ప్రకాశం జిల్లానీ ఆదుకునే అధికార పార్టీ నాయకుడే లేడా జీవి రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు నీటి కోసం రోజుకొక ఊరిలో ధర్నాలు రాస్తారోకోలు.చేతగాక పారిపోయిన మంత్రి

మార్కాపురం

పట్టణంలోని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ఐటి సెల్ కన్వీనర్ జీవీ రెడ్డి మాట్లాడుతూ
పశ్చిమ ప్రకాశంలో అన్ని నియోజకవర్గాలలో ఎటు చూసినా నీటి కోసం ప్రజలు ఆర్తనాదాలు వినిపిస్తున్నారు, గ్రామాలలో ప్రజలు త్రాగునీరు లేక కిలోమీటర్లు దూరం ప్రయాణం ప్రయాణించి తెచ్చుకుంటున్నారు, కనీస అవసరాలకు నీరు లేక ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న కనీసం పట్టించుకునే నాధుడే కరువయ్యారు, వేల అడుగులు బోర్లు వేసిన కానీ నీళ్లు పడని వైనం మన పశ్చిమ ప్రకాశంలో చూస్తూనే ఉన్నాం ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది అని తెలిసి కూడా నెల ఎక్కడో దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చే నీళ్ల ట్యాంకర్లను కూడా రాకుండా ఆపేశారు ఈ ప్రాంతాన్ని మీరు ఏం చేద్దాం అనుకున్నారు ఎమ్మెల్యేలు ఒకసారి ఆలోచించాలి.. అలానే పశువులకు పశుగ్రాహం లేక వలస పోయే పరిస్థితి ఏర్పడింది, మన ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు పని దొరక పని కోసం ప్రజలు వలస పోవడం చూసాము, కానీ ఇప్పుడు పశువులు ఉంటే వాటిని అమ్ముకోవడం లేదంటే వాటితో పాటు ప్రజలు కూడా వలస పోవాల్సి దుస్థితి ఈ పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఉంది, రెండు తపాలుగా మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ తన సొంత నియోజకవర్గంలో కానీ లేదా తను పుటి పెరిగిన నియోజకవర్గంలో గాని ఒక్కటంటే ఒక్కటి ప్రజలకు చెప్పుకోదగ్గ పనిచేయలేదు మంత్రి ఇక్కడ అభివృద్ధి చేయాల్సింది పోయి ఎక్కడ ఉంటే నేను గెలవలేను అని ఇక్కడ నుంచి పారిపోయి వేరే నియోజకవర్గం లో పోటీ చేయాలని అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నప్పుడు ఏమి చేయలేదు కానీ ఇప్పుడు కొండేపి నియోజకవర్గం వెళ్లి ఆ నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్లు ఇవ్వమని అడుగుతున్నారు అదే అత్యుత్సాహం తమ ప్రాంతం పట్ల ఉండి ఉంటే తమ ప్రాంత ప్రజలు విశ్వసించేవాళ్లు కల్లబొల్లి మాటలు ప్రజలకు చెప్పడం తప్ప, ఒక్క అభివృద్ధి పని అంటే ఒక్కటి కూడా చేయకుండా పారిపోయిన మంత్రి ఆదిములపు సురేష్..
ప్రకాశం జిల్లాకి వరప్రదాయని వెలుగొండ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు వస్తే ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు కడప జిల్లాలకు త్రాగు మరియు సాగునీరు వస్తుంది కానీ వారికి ఈ ప్రాజెక్టు పట్ల చిత్తశుద్ధి అనేది లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. మాట తప్పం మడమ తిప్పమని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు మడమ తిప్పారు, ఇలాంటి కల్లబొల్లి మాటలు ఎన్నో చెప్పి ప్రకాశం జిల్లా ప్రజలను ఓట్ల కోసం మభ్యపెడుతూ మోసం చేస్తూ ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇదిగో వెలుగొండ ప్రాజెక్ట్ అదిగో వెలిగొండ ప్రాజెక్టు నెలలో పూర్తవుతుంది అని చెప్పుకుంటూ వస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం నిన్నటి బడ్జెట్లో వెలిగొండ ప్రాజెక్టు కి రూపాయి అంటే రూపాయి కూడా కేటాయించని దుస్థితి మనం చూస్తున్నాం ముంపు గ్రామాల ప్రజలకు ఇప్పటికీ వారి రాయితీలు ఇంకా అందించలేదు ఇలాంటి సమస్యలు వెలుగొండ ప్రాజెక్టు చుట్టూ అనేకం వీరికి చిత్తశుద్ధి ఉండి పూర్తి చేయాలి అనుకుంటే ఇప్పటికిప్పుడు 1800 కోట్లు కేటాయించిన కూడా నెల రోజులలో ఈ ప్రాజెక్టు పూర్తవ్వదు, అలాంటిది నెలలో ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఇలాంటి కల్లబొల్లి మాటలు PRచెప్తున్నారు కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, మన ప్రాంత అభివృద్ధికి పట్టం కట్టండని విన్నవించుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఐదు సంవత్సరాలు చేసింది చాలు ఇంకా వెళ్లి ఇంట్లో కూర్చోండి అంతేకానీ మా దగ్గర డబ్బు ఉంది మేము ఎలా అయినా గెలుస్తాము అంటే ప్రజలు ఏమి చేతగాని వారు కాదు వారికి తెలుసు ఎవరికి ఓటు వేయాలో ఈసారి. కనీసం మీ ప్రాంతం గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు ప్రజలను ఇబ్బంది పెడతారు. మీ వల్ల ప్రకాశం జిల్లాకి అద్దురూపాయ ఉపయోగం లేకుండా పోయింది మీరు ఉన్నారనే విషయమే ప్రజలు మర్చిపోయారు, దయచేసి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు తోడ్పడాలి అంటే మీరు ఎన్నికల ఎన్నికలకు దూరంగా ఉంటే కనీసం కొత్తవారు వచ్చి ప్రాంతాభివృద్ధికి తోడ్పడుతారు. మీ ఎమ్మెల్యే సీట్ల కోసం చేసే ప్రయత్నం ప్రజల మంచి కోసం చేసి ఉంటే మీకే పిలిచి ఇచ్చేవాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఆ మాత్రం కూడా తెలియకుండా ఐదు సంవత్సరాలలో మీ ఇష్టం వచ్చినట్టు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఇప్పుడు ఎన్నికల టయానికి మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని సీఎం కాళ్ల చుట్టూ తిరుగుతున్నారు, ఇలాంటి వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేది ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article