వేలేరుపాడు:రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేసుకోవాలని సిఐ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు, ఈ సందర్భంగా ఆదివారం మండలంలోని పలు గ్రామాలలో పోలీస్ దళాలతో కవాతు నిర్వహించారు, ఈ సందర్భముగా కుక్కునూరు సీఐ మాట్లాడుతూ ,రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు వారి యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా, భయ, పక్ష పాతాలు లేకుండా వినియోగించుకొనుట కొరకు పోలీస్ అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నారని ప్రజలకు భరోసా కల్పించినారు.

ఎన్నికల నియమ నిబంధనలు అమలు లోనికి ఎన్నికల కమిషన్ తీసుకువచ్చిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ను ప్రజలు రాజకీయ పార్టీ వారు పాటించాలని,
ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి 50 వేల రూపాయల కంటే ఎక్కువ నగదుతో ప్రయాణం చేసే సమయంలో ఎవరైనా ఎక్కువ డబ్బులను కలిగి ఉంటే దానికి సరైన ధ్రువ పత్రాలు పోలీసు కి తెలియ చేయాలి లేదంటే ఆ డబ్బులను స్వాధీనం చేసుకుంటారన్నారు,
ఎన్నికల పోలింగ్ సందర్భముగా ఎదుటివారి యొక్క ఓటును వినియోగించుకునే విషయాలలో ఆటంకాలను సృష్టించరాదని ఫలానా పార్టీ వారికి ఓటు వేయాలని బెదిరించడం ,లేదా ప్రలోభాలకు గురి చేయడo చేయరాదు అని, చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు,
ఎన్నికల సందర్భంలో ఎవరైనా ప్రజా శాంతికి భంగం కలిగించిన దొంగ ఓట్లు వేయడం గాని లేదా ఓటర్ లను ప్రలోభాలకు గురి చేయడం గాని చేసిన యెడల వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అన్నారు,గ్రామాలలో ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సి ఐ శ్రీనివాస రావు హెచ్చరించినారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మీనారాయణ, హెచ్ సి దుర్గారావు, సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.