- అమ్మోవాన..!.. ఆ రోడ్డు ప్రయాణం నరకం
- ఆదమరిచి ఆ రోడ్డు పై ప్రయాణిస్తే ..ఇక అంతే సంగతి*
- ప్రభుత్వాలు మారిన రోడ్డు దుస్థితి మారదే..
- కూటమి ప్రభుత్వంలో కూడ కోట-నాయుడుపేట రోడ్డు బాగుపడేనా!
- వర్షం వచ్చిందంటే చాలు రహదారిపై ఏర్పడిన పెద్దపెద్ద గుంతలు
- రోడ్లు బురద మయం వాహనదారులే కాదు నడిచివెళ్లే వారికి సైతం ఇబ్బందే
- సియం చంద్రబాబు, డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ చొరవ చూపాలి
- నాయుడుపేట-కోట రోడ్డు బాగుచేసి పుణ్యం కట్టుకోండి*
ఆ రహదారిని ఆనుకొని సూళ్లూరుపేట, గుడూరు నియోజకవర్గాల సంబంధించిన పదుల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. కానీ వర్షం వచ్చిందంటే చాలు రహదారిపై ఏర్పడిన పెద్దపెద్ద గుంతలతో వాహనదారులే కాదు నడిచివెళ్లే వారికి సైతం ఇబ్బందే. అలాని ఇదేదో మారుమూల పల్లె అనుకుంటే పొరపాటే. నాయుడుపేట నుండి కోట పట్టణంకు వెళ్లే రహదారే.. వానొస్తుందంటే చాలు అక్కడి ప్రజలు అమ్మో వాన అంటూ రాకపోకలకు పడుతున్న ఇక్కట్లపై “ప్రజాభూమి” కథనం
(ప్రసన్న ,ప్రజాభూమిప్రతినిధి నాయుడుపేటరూరల్ )

తిరుపతి జిల్లాలో అభివృద్ధి చెందుతూ వ్యాపార కేంద్రాలకు నిలయమైన నాయుడుపేట – కోట వయా విద్యానగర్ మీదుగా పోతున్న రహదారితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కాలంగా పరిస్థితి మరింత విషమించిందని ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే రహదారిపై ఏర్పడిన పెద్ద గుంతల్లో నీరు చేరి చిన్నపాటి కాలువలను తలపిస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ కోట-నాయుడుపేట రహదారిని ఆనుకొని రెండు నియోజకవర్గాలకు చెందిన పదుల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి రోడ్డును ప్రజలు ఎక్కువగా వినియోగి స్తుండడం వల్ల బాగా గుంతలు పడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాకపోకలు జరుపడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలాసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఈ విషయమై విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదని ఆరోపిస్తున్నారు.
ఆరంభించారు అంతలోనే వదిలేశారు
ఈ మొత్తం రహదారిని అభివృద్ధి చేసేందుకు గతంలో 3 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని వాపోయారు. స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవతీసుకుని పనులు ప్రారంభించారు. కానీ మధ్యలోనే వదిలేశారు. దానితో మళ్లీ కథ మొదటివచ్చింది. రోడ్డు ప్రక్కన ఉన్న గ్రామాల వద్ద సిమెంట్ రోడ్లు వేయాలి.. వీలైతే 28కిలోమీటర్లు ఉన్న కోట-నాయుడుపేట రోడ్డు ను డబుల్ సిమెంట్ రోడ్డు వేస్తే భవిష్యత్తు లో ఎలాంటి ఇబ్బంది రాదు.. కారణం లేకపోలేదు ఈ మార్గం ప్రక్కన పల్లెలు ఉండటమే కారణం వ్యవసాయం కోసం గెజిలతో ట్రాక్టర్ లు రోడ్డు పైకీ రావడంతో తారు రోడ్లు ధ్వంసంఅవుతున్నాయి.అందువలన సిమెంట్ రోడ్లు అయితే ఎటువంటి సమస్య లు రావని ప్రజలు అంటున్నారు.*
ఆదమరిచి ఆ రోడ్డు పై ప్రయాణిస్తే ..ఇక అంతే సంగతి
కోట -నాయుడుపేట మధ్య ఉన్న రోడ్డు అద్వానకరంగా మారింది. ఎక్కడికక్కడ గుంతలు పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులు అతివేగంగా లేదా ఆదమరిచి వస్తే ఇక అంతే సంగతులు. పరలోకానికి ప్రయాణం చేయాల్సిందే. చీకట్లో వచ్చే ప్రయాణీకుల పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. సుమారు 40గ్రామాలకు వెళ్లేందుకు ఈరోడ్డుమార్గాన్నిఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా విద్యానగర్, గుడలి బ్రిడ్జ్, మెట్టు గ్రామాల్లో రోడ్లు బురద మయంగా మారారు. ప్రభుత్వాలు మారిన రోడ్డు దుస్థితి మారడం లేదు. సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలు కలిసిన ఈ రోడ్డు బాగుకోసం గూడూరు, సూళ్లూరుపేట శాసన సభ్యులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు, డిప్యుటీ సియం కోనేదల పవన్ కళ్యాణ్ చొరవ చూపి వెంటనే నాయుడుపేట – కోట రోడ్డు మార్గాన్ని మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.

