Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలునమ్మితే నట్టేట ముంచారు

నమ్మితే నట్టేట ముంచారు

పులివెందుల :
పులివెందుల ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర 7:30 కి పులి వెందుల చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్ సునీత మాట్లాడుతూ నాన్నను అతికిరాతంగా చంపిన కూడా ఎవరు నాకు తోడు లేరు నన్ను ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.హంతకులకు జగన్ నీడనిస్తున్నారని ఆమె అన్నారు. పార్లమెంటుకు షర్మిలను పంపిస్తే హంత కులను బయటపెడతారన్నారు. అవినాష్ రెడ్డి పై కేసు పెడితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని నాపై ఒత్తిడి తీసుకొచ్చారన్నారు.అనంతరంవైయస్ షర్మిలారెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పులి జగన్ మోహన్ రెడ్డి పులి అంటున్నారు నరేంద్ర మోడీ దగ్గర పిల్లి అయ్యార న్నారు.
జగన్ పాలనంతా అస్తవ్యస్తంగా ఉందన్నా రు. ప్రజలు అధికారం ఇచ్చింది హంతకులను కాపా డడానికా అంటూ జగన్ ను ప్రశ్నించారు. ఈ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయా న్ని సహించలేక తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఆ పార్టీ తరపున కడప లోక్ సభ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నానన్నారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పటికీ చిన్నాన్న వివేక హత్య కేసులో ఏమి సాధించారో జగన్ చెప్పాలని ఆమె ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వాళ్ల నుంచి రాజధాని ఎక్కడ నిర్మించారో చెప్పాలన్నారు . కుంభకర్ణుడు ఆరు నెలలైనా నిద్రపోతాడే తప్ప జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు నిద్రపోతూనే పులివెందుల ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన జగన్ ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారని ఆమె ఎన్నికలకు వచ్చేటప్పుడు పూర్తి మధ్యపానం చేస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ మద్యపానం నిషేధం చేశారు జగన్మోహన్ రెడ్డి సర్కార్ లో మద్యం అందిస్తున్నారన్నారు.ఎన్నికలకు ముందు జగన్ అనేక హామీలు ఇచ్చారన్నారు. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని, తద్వారా నిరుద్యోగ సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారన్నారు. కానీ ఒక్కగానొక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని వాపోయారు. జగన్మోహన్ రెడ్డి సంత చిన్నాన్నను హత్య చేయించిన వాళ్లకు ఎంపీ టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా తాను అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా సాధిస్తానని భరోసా ఇచ్చారన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రధాని మోడీకి భజన చేయడం మినహా హోదా సాధించ లేకపోయారన్నారు.
ఇలా ఎన్నో హామీలు ఇచ్చి వాటిని జగన్ విస్మరించడం దారుణమన్నారు.నేడు ఎక్కడ చూసినా మద్యం ఏరులై ఏరులై పారుతోం దని వారు అమ్మిన రేట్లకే కొనాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. మీ ఆడబిడ్డగా కొంగు చాచి అడు గుతున్నానని ఎంపీగా నన్ను గెలిపించండి అని నాకు న్యాయం చేయండి అని ప్రజలను అభ్యర్థిం చారు. నాకు మీరే న్యాయ నిర్ణీతలు అనే న్యాయ నిర్ణీతలు అని భావిద్రోగానికి గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, మైనింగ్, గంజాయి దండా నడుస్తోందన్నారు. ఇదంతా జగన్ కనుసన్నలలో నే నడుస్తోందని ద్వజమెత్తారు. ఇంతటి అవినీతి రాజ్యం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. రాబోవు ఎన్నికలలో జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తాను న్యాయం కోసం పోరాడుతున్నానని, జగన్ అవినీ తి కోసం పాకులాడుతున్నారని తెలిపారు.ఈ ఎన్ని కలలో న్యాయం కావాలా లేక అవినీతి కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంద న్నారు.రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావాల న్నదే తమ జీవితాశయం అన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి వేయించి గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు తులసి రెడ్డి, పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ వేలూరు శ్రీనివాసులురెడ్డి, ధ్రువ కుమార్ రెడ్డి, శివప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article