Monday, May 5, 2025

Creating liberating content

తాజా వార్తలునగరంలో గాలివాన బీభత్సం…

నగరంలో గాలివాన బీభత్సం…

విరిగిపడిన చెట్లు…
— కూలిన హోల్డింగులు…
— వాయువేగంతో స్పందించిన కలెక్టర్…
— క్షేత్రస్థాయి పర్యటనతో…
“నీట్” అభ్యర్థులకు తొలగిన అడ్డంకులు…
విజయవాడ :
ప్రతిరోజు ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరయ్యే నగరవాసులు ఆదివారం ఉదయం ఒక ఆహ్లాద వాతావరణం అనుభవించారు. ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. క్షణాల్లో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.చల్లనిగాలులు ఉన్నట్టుండి ఈదురుగాలులుగా మారాయి. ఈ గాలుల దెబ్బకు పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి. వాణిజ్య ప్రచారం కోసం రోడ్లు పక్కన ఏర్పాటు చేసిన హోర్డింగులు రోడ్లపై కుప్పకూలాయి. ఇవన్నీ గాలివాన వచ్చిన సమయంలో సాధారణంగా జరుగుతాయి. కానీ ఈ ఆదివారం లక్షలాదిమంది నీట్ అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సిన సమయంలో జరగడంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నీట్ అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరేందుకు రవాణా సౌకర్యాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాయు వేగంతో స్పందించారు. పాలీ క్లినిక్ రోడ్డు, నిర్మలా కాన్వెంట్ జంక్షన్, హనుమాన్ పేట తదితర ప్రాంతాలకు ఈదురుగాలులు ప్రారంభమైన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, కార్పొరేషన్ సిబ్బందిని వెంట తీసుకుని క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. ఎక్కడెక్కడ చెట్లు కూలాయో..హోర్డింగులు విరిగిపడ్డాయో క్షణాల్లో సమాచారం సేకరించారు. నీరు నిలిచిపోయే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాలలో మోటార్లతో నీటిని వెంటనే తోడించారు. నగరంలో నీట్ పరీక్ష కేంద్రాలకు వెళ్లే ప్రతి మార్గాన్ని రవాణా వాహనాలకు ఇబ్బంది లేకుండా తక్షణం చక్కదిద్దారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా నీటి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరు అనే విషయం దృష్టిలో పెట్టుకొని ప్రతి విద్యార్థి నిర్ణీత వ్యవధిలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా పరిస్థితులు చక్కదిద్దారు. జిల్లా యంత్రాంగం మొత్తాన్ని అప్పటికప్పుడు సమన్వయం చేశారు. సాధారణ సందర్భాల్లో కంటే విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే సమయంలో ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడు జిల్లా యంత్రాంగం ఎంత వేగంగా స్పందిస్తుందో కలెక్టర్ క్షేత్రస్థాయిలో చేసి చూపించారు.ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈరోజ ఉదయం అరగంటలో 147 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిందని తెలిపారు . ఈ రోజు రేపు వాతావరణ లో మార్పులు ఉంటాయని ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేశామన్నారు . ప్రజలు తగు జాగ్రత్తల తో అప్రమత్తంగా ఉండాలని, ఈదురు గాలులకు చెట్లు కూలిపోయే అవకాశం ఉందని చెట్ల కింద వాహనాలు నిలపకుండా భద్రమైన ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకోవాలన్నారు.వర్షాలు పడే సమయంలో తప్పని సరైతేనే బయటకు రావాలని పేర్కొన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే కలెక్టరేట్లో ప్రజల సౌకర్యం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా 9154970454 నంబర్ కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చునని తెలిపారు. ముఖ్యంగా రానున్న రెండు రోజుల్లో ఇటువంటి గాలి.. వాన వాతావరణం ఉంటుందన్నారు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లిన పౌరులు గాలి వాన వాతావరణం కనిపిస్తే ఎక్కడ ఉన్నవారు అక్కడే ఆగిపోవాలన్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పౌరులు నిర్లక్ష్య ధోరణి తో ఇబ్బందులు గురికావద్దని సూచించారు.జిల్లా ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కలెక్టర్ కార్యాలయం తక్షణం స్పందిస్తుందని ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ రూమ్ లో అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article