బిజెపి కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు.
ప్రజాభూమి పోరుమామిళ్ల:
నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్,సెల్ఫ్ లాస్ట్ అనేదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అని బిజెపి కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం పార్టీకి నష్టం జరుగుతున్న కూడా పట్టించుకోకుండా దేశ ప్రయోజనాలే ముఖ్యమని భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలలో అనేక చట్టాలు తెచ్చింది. ఆర్టికల్ 370 రద్దు విషయంలోను, త్రిపుల్ తలాక్ విషయంలోనూ, మహిళా బిల్లు అమలు పరచడంలోనూ, ఇలా అనేక సందర్భాలలోదేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం కల్పించిందన్నారు. ఈ చట్టాలన్నీ అమలు చేయడంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక సమస్యలు,విమర్శలు ఎదుర్కొన్నాడన్నారు. ఒక భారతీయ జనతా పార్టీ తప్ప మిగిలిన పార్టీలన్నీ కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ దేశం, రాష్ట్రం ఏమైపోతున్న పర్వాలేదు కానీ వారికి, వారి పార్టీలకు నష్టం కలవకుంటే చాలుఅనే విధంగా ఉన్నాయన్నారు.దేశం గురించి ఆయా పార్టీల వారు ఏనాడు ఆలోచించరు. నేడు దేశంలోని యువత,మేధావి వర్గం, అంతా ఈ విషయాన్ని సంపూర్ణంగా గ్రహిస్తూ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బిజెపినే అధికారం చేపట్టాలని కోరుకుంటున్నారు. నేడు ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి తీరు పట్ల రాష్ట్ర ప్రజలు విస్మయం చెందుతున్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ప్రాంతీయ పార్టీలను విడనాడి భారతీయ జనతా పార్టీకే మద్దతు తెలిపి దేశ అభివృద్ధిలోనూ, రాష్ట్ర అభివృద్ధిలోనూ పాలుపంచుకోవాలని బిజెపి కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు కోరారు.