Sunday, February 15, 2026

Creating liberating content

సాహిత్యందుర్గాడలో ఘనంగా రామలింగేశ్వర స్వామి కల్యాణం

దుర్గాడలో ఘనంగా రామలింగేశ్వర స్వామి కల్యాణం

గొల్లప్రోలు:       గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో  శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి కళ్యాణం గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు మహాగణపతి పూజ, పుణ్యాహవాచన, రక్షాబంధన ధారణ, భేరి పూజ ,ధ్వ, కన్యాదానం, సుముహూర్తం, తలంబ్రాలతో వైభవంగా కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు. ఆగమశాస్త్ర పండితులు రామచంద్రపురం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గణేష్ శర్మ ఆధ్వర్యంలో వైదిక క్రతువులు స్వామివారి కళ్యాణ విశేషాల వివరణ తో వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఇటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సేవా సభ్యులు పర్యవేక్షణ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article