Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుదద్దాలకు ఘనస్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు

దద్దాలకు ఘనస్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు

దద్దాల దెబ్బకు దద్దరిల్లిన సి యెస్ పురం
కనిగిరి కాటంరాజు గడ్డ యాదవుల అడ్డా అంటున్న దద్దాల అభిమానులు
ఆశీర్వాదించండి అండగా ఉంటానన్న దద్దాల

హనుమంతునిపాడు
కనిగిరి నియోజకవర్గానికి నూతన ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టి చంద్రశేఖరపురం మండలం నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ కు వైసీపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. పట్టణంలో భారీ బైకు ర్యాలీతో పుష్ప వర్షంలో బాజా బజంత్రీలతో బాణసంచా పేలుళ్లతో గజమాల స్వాగతంతో కార్యకర్తలు కదం తొక్కుతుంటే గర్జించే సింహమై కనిగిరి వైసీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఫంక్షన్ హాల్ లో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ అతి సామాన్య వ్యక్తినైనా తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం జరిగిందని నియోజకవర్గంలోని ప్రజలందరు కలిసికట్టుగా పనిచేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో దూసుకెళ్లేలా కృషి చేయాలని కోరారు. అలానే చంద్రశేఖరపురం మండలంలో ఇంతటి ఘన స్వాగతం పలికిన నేతలకు తన ధన్యవాదాలు తెలిపారు. ఇలానే ప్రతి ఒక్కరు రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి తన విజయానికి కృషి చేయాలని కోరారు.స్థానిక ముద్దుబిడ్డ గా మీ అందరి పెద్దబిడ్డగా మీకు తోడుగా నీడగా ఉంటానని ఆశీర్వాదించండి అండగా ఉంటానని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమాంద్ర ప్రదేశ్ గా మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో యుద్దానికి సిద్ధం కావాలని వై యస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి గా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులతో విజయం సాధించి కనిగిరిని కనకగిరిగా మార్చే బాధ్యత నాదేనన్నారు. ఈ సందర్భంగా దద్దాల అభిమానులు కనిగిరి కాటంరాజు గడ్డ యాదవుల అడ్డా అని మీ గెలుపే కనిగిరి నియోజకవర్గమునకు మలుపు అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో చంద్రశేఖరపురం జడ్పిటిసి మేకల శీను, మండల పార్టీ అధ్యక్షులు భువనగిరి వెంకటయ్య వైస్ ఎంపీపీ దుగ్గిరెడ్డి ప్రతాపరెడ్డి వైసిపి నాయకులు తిరుపతిరెడ్డి మాల్యాద్రి తిరుపతిరావు తిరుపాలు నారాయణరెడ్డి సర్పంచులు నాగమణి ఎల్లయ్య అంబాల లక్ష్మీదేవి
రాధాకృష్ణారెడ్డి ప్రవీణ్ వెంగళరావు వెంకటేశ్వర్లు ఉపసర్పంచ్ పెద్ద సుబ్బయ్య భైరవకోన ఫస్ట్ బోర్డు చైర్మన్ సిద్దు రమణారెడ్డి నారాయణస్వామి ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ జైరెడ్డి మల్లికార్జున్రెడ్డి మాజీ ఎంపిటిసి వైసీపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి దుగ్గిరెడ్డి రాము షేక్ ఉపసర్పంచ్ ఈ మాస సర్పంచి మర్రి రామయ్య చింతపూడి సర్పంచ్ వసంత రాజు ఉపసర్పంచ్ దూదేకురి శ్రీనివాస్ వైసీపీ నాయకులు శేఖర్ మార్కెట్ యార్డ్ నెంబర్ రమణారెడ్డి నల్లమడుగుల సర్పంచ్ సూరిపోగు ఆంటోనీ సర్పంచి భానుతేజ మాజీ సర్పంచ్ బాలయ్య సర్పంచి భారతి నారాయణరెడ్డి చోడ రవిచంద్ర రెడ్డి పంతం సుబ్బయ్య మాబు పిడిసిసి బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి జెడ్పిటిసిల సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కనిగిరి జడ్పీటీసీ మడతల కస్తూరి రెడ్డి వైసీపీ నాయకులు కటికల వెంకటరత్నం దాదిరెడ్డి మాలకొండ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ మోహన్ రెడ్డి కమతం రమణారెడ్డి వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article