Saturday, November 8, 2025

Creating liberating content

టాప్ న్యూస్తోపుదుర్తి బ్రదర్స్ తోపులేనా!?

తోపుదుర్తి బ్రదర్స్ తోపులేనా!?

  • ప్రభుత్వం ఏదైనా వారి అనుచర గణందే హవా
  • నిజమేనంటున్న దిగువ శ్రేణి కూటమి నేతలు
  • పలు మండలాల్లో వారివే పనులు రూ, కోట్లలో బిల్లులు
  • కమిట్మెంటే కారణమంటూ సర్వత్ర ఆరోపణలు
  • పైపైనే ప్రజా ప్రతినిధి విమర్శనాస్త్రాలు ఆ మాటల్లో సందేహాలేన్నో?

  • ప్రజాభూమి ప్రత్యేక ప్రతినిధి, అనంతపురం, : ఆయనో బ్రాండ్, ఆ బ్రాండే ఆ కుటుంబానికి ఓ సంపద, సీమ ప్రాంతంలో అరాచకాన్ని అంతమొందించి అన్ని వర్గాల్లో గుర్తింపు తెచ్చుకుంటూ తనకంటూ ఓ బ్రాండ్ సృష్టించుకున్నాడు. ఆ బ్రాండ్ ఆయన వంశానికి లెక్కలేనన్ని రూ, కోట్లు అటు ఇటు వంద తరాలు కూర్చుని తిన్న తరగని సంపదతో పాటు రాజకీయంగా ఎదిగేలా అన్ని చేసేసి భౌతికంగా లేకున్నా సీమ ప్రాంత ప్రజల హృదయాల్లో నిలిచి పోయాడు. అప్పటి కాలంలోనే కాదు ఇప్పటి కాలంలో కూడా భౌతికంగా ఆ మహానుభావుడు లేకున్నా ఆయన చేసిన సేవలను ఎందరో గుర్తు చేసుకుంటున్నారు. ముక్కు సూటిగా చెప్పాలంటే ఆయన ఎవరో కాదు పరిటాలరవన్న
    . సీమలో ఎగిసిన కెరటం. ఆయన పేరు గట్టిగా చెప్పాలన్న పలువురు ముఖ్య నేతల సైతం భయపడిన సందర్భాలేన్నో. ఎంత ఉన్నా ఎన్ని రూ,కోట్ల ఆస్తులున్న ఆ కుటుంబానికి 2019లో ఓటమి తప్పలేదు. అప్పుడే తొలిసారిగా రాప్తాడుకు ప్రజాప్రతినిధులుగా వచ్చారు తోపుదుర్తి బ్రదర్స్. ఏం చేశారూ ఆ నియోజకవర్గానికి అన్నది ఇక్కడ అప్రస్తుతం. ప్రతి నిత్యం మీడియా ఎదుట రాప్తాడు ప్రజా ప్రతినిధి అయిన పరిటాల సునీత చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో అన్నది మాత్రం ఆమెకే తెలుసునన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే కూటమి ప్రభుత్వం వారిదైనప్పటికీ ఏ విధంగా కూడా ఏ దిశగా కూడా సూటిగా వారికి తగిలేలా ప్రభుత్వంతో చర్చలు జరిపి విచారణకు పోయిన సందర్భాలే లేవు. అయినా అదంతా లేకున్నా నిత్యం మీడియాలో వారు తోపులా తురుములా అంటూ వల్లే వేస్తూనే ఉండటం అందరికి విధితమే. ఆమె మాటలకు తగ్గట్టుగానే లోలోన పలువురు పలువురి వద్ద పలుచోట్ల అదే కూటమి పార్టీ శ్రేణులు తోపుదుర్తి బ్రదర్స్ తోపులే సందేహమేమీ అన్నట్లుగా సంభాషించుకున్నట్లు కూడా తెలియవస్తోందిఅందుకు గల కారణాలను ఒకింత పరిశీలన చేస్తే తోపుదుర్తి బ్రదర్స్ ముగ్గురు ముగ్గురే. రాజశేఖర్, చందు, ప్రకాష్. అయితే ఈ ముగ్గురిలో జనంలో ఎక్కువగా నానుడి ఉన్న వ్యక్తులు తోపుదుర్తి చందు, తోపుదుర్తి ప్రకాష్, ఎందుకు అని ఎవరికైనా సందేహం కలగవచ్చు. వీరు 2019లో అధికారం లో ఉన్న సమయంలో మాటలకే కాదు చేతులకు కూడా పని పెట్టారు. వైసిపి పార్టీ నుండి టిడిపిలోకి పోయిన వారి మీద వారు ఏమి చేశారో అక్కడి ప్రజలకు ఇరు పార్టీల నాయకుల కు విదితమే. ఈ విషయం ద్విపార్టీ నేతలకు, పార్టీ శ్రేణులకు తెలిసిన విషయమే. ఇదే కాదు ఎన్నో భూ ఆక్రమణ, అమ్మ పాల డైరీ పేరుతో పలువురు గ్రామీణుల నుండి బలవంతంగా భూములు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక జాకీ పరిశ్రమ విషయానికి వస్తే వారు వెళ్లగొట్టారో లేదో తెలియదు గాని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి పదహరు నెలలు గడిచిపోతున్న మళ్లీ ఎందుకు ప్రయత్నించలేదని జనం అంటున్నారు. ఇది ఒకటే కాదు మాటలకు పని పెట్టారు అని చెబుతున్నారే ఆ మాటలు ఏమిటి అంటే మరీ ముఖ్యంగా తోపుదుర్తి చందు తాము మళ్లీ అధికారంలోకి వస్తే నారా లోకేష్, చంద్రబాబును ఉండనివ్వమని బహిరంగంగా మీడియాతో సవాల్ కూడా విసిరనది తెలిసినదే ఈ విషయం పరిటాల సునీతకు కూడా తెలుసు. మరి ఆమె వీరి మీద ప్రభుత్వానికి ఏమి సమాచారం ఇచ్చింది ఏ దిశగా చర్యలకు అడుగులు వేసింది అన్నదే ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అది చేశారు ఇది చేశారని పైపై మాటలు తప్ప వారి మీద కూటమి ప్రభుత్వ
    పరంగా కానీ, న్యాయం పరంగా గాని చర్యలకు ఎలాంటి ముందడుగు వేయలేదన్న బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఆ నియోజకవర్గంలో లోపాయికారి రాజకీయాలు నడుస్తున్నాయని కూటమిపార్టీతోపాటు వైసీపీ పార్టీలో కూడా ఊకదంపుడు చర్చ నడుస్తోంది.
    ఎవరీ రమణారెడ్డి? కాంట్రాక్ట్ పనులతో గత వైసిపి ప్రభుత్వం లో హవా సాగించిన ఈ రమణారెడ్డి, ప్రస్తుతం కూటమి పార్టీలో కూడా రాప్తాడు నియోజకవర్గం లోని పలు మండలాల్లో కాంట్రాక్ట్ పనులతో తన హవాసాగిస్తున్నాడు. ఎవరు ఇతనుఅంటే తోపుదుర్తి బ్రదర్స్ చిన్నాన్న కొడుకు అని తెలిసింది. కమిట్మెంట్ రాజకీయాల్లో భాగంగానే ఇతనికి సంబంధించిన పాత పనులకు ( వైసీపీ ప్రభుత్వంలో చేసినవి ) బిల్లులు సైతం చెయ్యండని ప్రస్తుత ప్రజా ప్రతినిధి పరిటాల సునీత దగ్గరుండి అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని, ఇదే కాక రాప్తాడు పరిధిలోని కనగానపల్లి, రామగిరి, ఆత్మకూరు లతోపాటు పలు మండలాల్లోను కాంట్రాక్ట్ పనులతో పెద్ద పీట వేసి ఏ కాంట్రాక్టర్ కు చెల్లించనంత రూ, కోట్లలో పెద్ద మొత్తంలో బిల్లుల చెల్లింపు పై ఆ నియోజకవర్గంలో పెద్ద దుమారం రేగుతుంది. ఇది కాదా లోపాయికారి రాజకీయం అంటూ విమర్శలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఆ తోపుదుర్తి కుటుంబానికి చెందిన రమణ రెడ్డి కి మించిన మరో కాంట్రాక్టర్ ఆమెకు దొరకలేదా, క్లాస్ వన్ కాంట్రాక్టర్లుగా ఎందరో ఉన్నప్పటికీ, నియోజవర్గంలో పనులు చేసి బిల్లులు రాక ఎందరో కాంట్రాక్టర్లు తల్లడిల్లుతున్న ఆ కుటుంబానికి చెందిన ఆ రెడ్డికే నియోజకవర్గంలో పనులు సకాలంలో బిల్లులు చెల్లింపు తోనే తోపుదుర్తి బ్రదర్స్ తోపులే ‘నా ‘ అని రాప్తాడు నియోజకవర్గంలో తారాస్థాయిలో చర్చ నడుస్తుంది. మరో రాజకీయ విశ్లేషణాత్మక కథనంతో వచ్చే సంచికలో… చూద్దాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article