తెదేపా సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్
హిందూపురం టౌన్
తెలుగుదేశం పార్టీతోనే ఉప్పర్లు అన్ని విధాలా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్ పేర్కొన్నారు ఉప్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలు స్థితిగతుల గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా తెలుసు అని చెప్పారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హిందూపురం పార్లమెంటు బీసీల భరోసా బాట సమావేశం జరిగింది. జిల్లా సగర సాధికార కన్వీనర్ కేహెచ్ వెంకటనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సగరులకు చంద్రబాబు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. సగర కుల వంశ మూలపురుషుడు శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా చేస్తూ జీవో ఇచ్చిన ఘనత చంద్రబాబు కే దక్కుతుందన్నారు. అదేవిధంగా నిర్వీర్యంగా ఉన్న సగర ఫెడరేషన్ ని సగర కార్పొరేషన్ గా నామకరణం చేసి కోట్ల రూపాయలు నిధులు కేటాయించి సగరులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసినట్లు హర్షద్వానాల నడుము తెలిపారు. సగర కులాన్ని ఎవరైనా అనుచిత వ్యాఖ్యలతో దూషిస్తే కుల దూషణ కింద శిక్షార్హులను చేస్తూ జీవో ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. అయితే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని బీసీ కులాలతో పాటు మన సగరులను కూడా అన్ని రంగాల్లో అణిచివేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో రాష్ట్రంలోని సగరులంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా కృషి చేద్దామన్నారు. అంతకుముందు ఉప్పర్లు ఆటోనగర్ లో ఉన్న భగీరథ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి ర్యాలీగా పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర సాధికార మెంబర్ బి.గోపాలకృష్ణ, సగర సాధికార సోషల్ మీడియా కోఆర్డినేటర్ గజ్జల గణేష్, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ గంగాధర్ , ఉప్పర సంఘం ప్రతినిధులు రామప్ప డ్యూటీ రామన్న, నారాయణస్వామి నరసింహప్ప సంజీవప్ప శీన జిల్లా సగర సాధికార నెంబర్లు, సగర సంగం యువత, మహిళలు పాల్గొన్నారు.