రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే సత్తా చంద్రబాబు నాయుడికే సాధ్యం
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పార్థసారథి
పెనుకొండ :సోమందేపల్లి లోని పార్టీ కార్యాలయంలో జయహో బిసి సభ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులునిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ బీసీలకు అన్ని విధాల పెద్ద పీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచే సత్తా కేవలం చంద్రబాబు నాయుడుకే సాధ్యమని బీసీలంతా ఉండి తెలుగుదేశం పార్టీని 175 నియోజకవర్గాలలో గెలిపించుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం బీసీల ఓట్లతో గద్దెనెక్కి అనంతరం మొండి చేయి చూపిందన్నారు. వచ్చే ఎన్నికలలో బీసీల సత్తా ఏమిటో చూపించాలన్నారు. ప్రాణాలు అర్పించినా బీసీలంతా ఐక్యతతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామన్నారు. బీసీలను ఓట్ల కోసం వాడుకొని ఒకే సామాజిక వర్గానికి పదవులను కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు నరసింహారావు ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ నారాయణ రాష్ట్ర సాధికారిక సభ్యులు గోపాల్ ఈశ్వర్ నాగమణి మండల కన్వీనర్లు సిద్దలింగప్ప నరహరి సిద్దయ్య లక్ష్మిరెడ్డి చంద్ర సంజీవరెడ్డి భాను కీర్తి రామకృష్ణ శరత్ చంద్ర రెడ్డి కిష్టప్ప శేఖర్ భాను జనసేన నాయకులు భాషా నాగరాజు సూరి మాజీ జెడ్పిటిసి లు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు గ్రామపంచాయతీ అధ్యక్షులు జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.