ముదిగుబ్బ
ముదిగుబ్బ మండల కేంద్రంలో సోమవారం తెలుగుదేశంపార్టీ బీసీ నాయకులు, కార్యకర్తలు భారీబైక్ ర్యాలీ నిర్వహించారు.
స్థానిక షాదిమహల్ సమీపాన నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టిడిపి జిల్లానాయకులు టిడిపి కదిరి ఇన్చార్జి కందికుంట వెంకటప్రసాద్, గుండుమల తిప్పేస్వామి, అంబికా లక్ష్మీనారాయణ, ఈరన్న, కుంటిమద్ది రంగయ్య తదితరులకు మండల నాయకులు, కార్యకర్తలు ముదిగుబ్బ కస్తూరిభా కాలనీ వద్దనుండి పెద్దఎత్తున బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ కూడలి నందు ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాలశ్రీరామ్ కు మొక్కజొన్న పొత్తులతో తయారుచేసిన భారీగజమాలతో క్రేన్ ద్వారా బీసీ నాయకులు స్వాగతం పలుకుతూ సత్కరించారు.