Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుతుమ్మలపల్లి యురేనియం మైన్స్ లో ప్రథమ భద్రతా వారోత్సవాలు

తుమ్మలపల్లి యురేనియం మైన్స్ లో ప్రథమ భద్రతా వారోత్సవాలు

వేముల

వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం మైన్స్ 2008 వ సంవత్సరములో ప్రారంభించడము జరిగింది. 16 సంవత్సరాల తర్వాత మొట్ట మొదటి సారిగా భద్రతా వారోత్సవాలు 12.02.2024 నుండి 18.02.2024 వరకు జరగనున్నాయి. ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన తుమ్మలపల్లి మైన్స్ జనరల్ మేనేజర్ ( ఈఎస్ ఏపి) ఎమ్మెస్ రావు మరియ ఎస్ఎం ఎస్ఎల్ ప్రెసిడెంట్ కె ఆర్ రావు జ్యోతి ప్రజ్వలనము ద్వారా భద్రతా వారోత్సవాలను ప్రారంభించడము జరిగింది.


సభను ఉద్దేశించడం కిషోర్ భగత్ , మైన్స్ మేనేజర్ శేఖరం బాబు , సేఫ్టీ ఆఫీసర్ చంద్రశేఖర్ గని భద్రత గురించి ప్రసంగించారు. ఈ భద్రతా వారోత్సవాలను ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయ భద్రతా అవార్డు రెండు సార్లు తుమ్మలపల్లి మైన్స్ సాధించినందుకు అభినందించారు. మైన్స్ లో పని చేసే ప్రతి ఒక్కరు సురక్షా నియమాలను తు.చ తప్పకుండా పాటించవలసిందిగా సూచించారు.భద్రతను ఏ విధముగా పాటించాలి అనేది గనుల భద్రతా వారోత్సవాల సందర్భముగ మోడల్స్ తయారు చేసి సులువుగా అర్థము చేసుకొనుటకు వివిధ శాఖల వారు మోడల్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమములో ఎస్ఎంఎస్ సీ వి వో ,ఎస్ఎం ఖలీల్ యు సి ఎల్ ఆఫీసర్ టర్జీ , శ్రీకాంత్, మోహన్ రెడ్డి (అసిస్టెంట్ మేనేజర్ )నవీన్ కుమార్ రెడ్డి ( సూపర్డెంట్) ఎస్ఎంఎస్ మరియు కార్మికులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article