నేత్రపర్వంగా తిరుమలలో శ్రీవారి పుష్యమాస పౌర్ణమి గరుడసేవ జరిగింది. పౌర్ణమి సందర్భంగా తిరుమల స్వామివారు గరుత్మంతుడిపై నాలుగు మాడావీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. స్వామివారు ప్రతిరూపమైన మలయప్పస్వామి బంగారు గరుడుడుని అదిరోహించగా, అర్చకస్వాముల ఉత్సవమూర్తికి విశేష అలంకరణాల చేసిన తరువాత వాహన సేవ ఊరేగింపు ప్రారంభమైంది. ముందు గజరాజులు నడువగా, కోలాటాలు, భజన బృందాలు ప్రదర్శనలు, కూడల్లో స్ధానికులు, భక్తులు సమర్పించే కర్పూర హారతులతో నడుమ తిరుమలేశుని పౌర్ణమి గరుడవాహన సేవ కన్నులపండువగా సాగింది. వేలాది మంది భక్తులు స్వామివారి వాహన సేవను దర్శించుకున్నారు.