కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి :సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో తిరుపతి జిల్లా పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఏప్రిల్ 25 నాటికి 18,12,980 మంది ఓటర్లు ఉన్నారని, మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని, ఇందులో 41,993 మంది 18-19 సంవత్సరాలు కలిగిన యువ ఓటర్లు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తిరుపతి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలైన గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు పరిధిలో 8,83,330 మంది పురుషులు, 9,29,466 మంది స్త్రీలు, 184 మంది ట్రాన్స్ జండర్లు మొత్తం 18,12,980 మంది ఇందులో.. 18-19 సం. ఓటర్లు 41,993, సర్వీస్ ఓటర్లు 862, ఎన్.ఆర్.ఐ. ఓటర్లు 291, పి.డబ్ల్యూ.డి. ఓటర్లు 24,596 మంది, 85 సం. పైబడిన ఓటర్లు 7,924 మంది ఉన్నారన్నారు.
తిరుపతి జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలోని ఓటర్ల వివరాలు . . .
120 – గూడూరు (SC) అసెంబ్లి నియోజకవర్గం: 1,19,164 మంది పురుషులు, 1,26,007 మంది స్త్రీలు, 34 మంది ట్రాన్స్ జండర్లు మొత్తం 2,45,205 మంది … ఇందులో 18-19 సం. ఓటర్లు 5320, సర్వీస్ ఓటర్లు 36, ఎన్.ఆర్.ఐ. ఓటర్లు 46, పి.డబ్ల్యూ.డి. ఓటర్లు 3174 మంది, 85 సం. పైబడిన ఓటర్లు 1395 మంది ఉన్నారు.
121 – సూళ్ళూరుపేట (SC) అసెంబ్లి నియోజకవర్గం: 1,18,094 మంది పురుషులు, 1,24,492 మంది స్త్రీలు, 24 మంది ట్రాన్స్ జండర్లు మొత్తం 2,42,610 మంది … ఇందులో 18-19 సం. ఓటర్లు 5275, సర్వీస్ ఓటర్లు 94, ఎన్.ఆర్.ఐ. ఓటర్లు 28, పి.డబ్ల్యూ.డి. ఓటర్లు 4209 మంది, 85 సం. పైబడిన ఓటర్లు 1081 మంది ఉన్నారు.
122 – వెంకటగిరి అసెంబ్లి నియోజకవర్గం: 1,18,888 మంది పురుషులు, 1,24,690 మంది స్త్రీలు, 04 మంది ట్రాన్స్ జండర్లు మొత్తం 2,43,582 మంది … ఇందులో 18-19 సం. ఓటర్లు 5539, సర్వీస్ ఓటర్లు 55, ఎన్.ఆర్.ఐ. ఓటర్లు 34, పి.డబ్ల్యూ.డి. ఓటర్లు 3490, 85 సంవత్సరాలు పైబడిన ఓటర్లు 1468 మంది ఉన్నారు.
166 – చంద్రగిరి అసెంబ్లి నియోజకవర్గం: 1,52,988 మంది పురుషులు, 1,62,109 మంది స్త్రీలు, 62 మంది ట్రాన్స్ జండర్లు మొత్తం 3,15,159 మంది … ఇందులో 18-19 సం. ఓటర్లు 8061, సర్వీస్ ఓటర్లు 399, ఎన్.ఆర్.ఐ. ఓటర్లు 49, పి.డబ్ల్యూ.డి. ఓటర్లు 4221, 85 సంవత్సరాలు పైబడిన ఓటర్లు 1255 మంది ఉన్నారు.
167 – తిరుపతి అసెంబ్లి నియోజకవర్గం: 1,49,846 మంది పురుషులు, 1,52,622 మంది స్త్రీలు, 35 మంది ట్రాన్స్ జండర్లు మొత్తం 3,02,503 మంది … ఇందులో 18-19 సం. ఓటర్లు 6460, సర్వీస్ ఓటర్లు 93, ఎన్.ఆర్.ఐ. ఓటర్లు 94, పి.డబ్ల్యూ.డి. ఓటర్లు 2024, 85 సంవత్సరాలు పైబడిన ఓటర్లు 1498 మంది ఉన్నారు.
168 – శ్రీకాళహస్తి అసెంబ్లి నియోజకవర్గం: 1,19,973 మంది పురుషులు, 1,28,549 మంది స్త్రీలు, 14 మంది ట్రాన్స్ జండర్లు మొత్తం 2,48,536 మంది … ఇందులో 18-19 సం. ఓటర్లు 6640, సర్వీస్ ఓటర్లు 97, ఎన్.ఆర్.ఐ. ఓటర్లు 21, పి.డబ్ల్యూ.డి. ఓటర్లు 3278, 85 సంవత్సరాలు పైబడిన ఓటర్లు 653 మంది ఉన్నారు.
169 – సత్యవేడు (SC) అసెంబ్లి నియోజకవర్గం: 1,04,377 మంది పురుషులు, 1,10,997 మంది స్త్రీలు, 11 మంది ట్రాన్స్ జండర్లు మొత్తం 2,15,385 మంది … ఇందులో 18-19 సం. ఓటర్లు 4898, సర్వీస్ ఓటర్లు 88, ఎన్.ఆర్.ఐ. ఓటర్లు 19, పి.డబ్ల్యూ.డి. ఓటర్లు 4200 మంది, 85 సం.లు పైబడిన ఓటర్లు 574 మంది ఉన్నారు.

