గొల్లప్రోలు
గొల్లప్రోలు మండలం తాటి పర్తి గ్రామంలోని శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృత సుగంధ ద్రవ్య అభిషేకములు చేసి పుష్పార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు చేశారు. ఈ పూజా కార్యక్రమాలను దైవజ్ఞరత్న ఆకొండి వెంకటేశ్వర శర్మ,ఆలయ ప్రధాన పూజారి ఆకొండి ప్రభాకర శాస్త్రి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గారపాటి బుజ్జి,గ్రామ ఉపసర్పంచ్ దాసం వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు నక్కా గజేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.