Sunday, November 9, 2025

Creating liberating content

టాప్ న్యూస్తరలిపోతుంది ఎర్రబంగారం

తరలిపోతుంది ఎర్రబంగారం

అడ్డుకట్ట వేయలేక పోతున్నారు అధికారులు
*కొండలు పిండి చేస్తున్న పట్టించుకునే నాధుడే లేరు
*రాత్రి పగలు లేదు..లారీల మోతకు..
*పోలీస్, రెవెన్యూ కార్యాలయాలకు కూతవేటు దూరమే..
*అయినా వారి కళ్ళకు కనిపించని వైనం
*అటు లారీల మోత ఇటు అధిక స్పీడు .
*అల్లాడిపోతున్నామని ఆవేదనలో ప్రజలు
*ఈ అక్రమాలను ఆపేదెవరంటున్న అక్కడి ప్రజలు..
*జాజులవానిపాలెంలో అక్రమ గ్రావెల్ ఆగే దెన్నడూ…?
ప్రజాభూమి ప్రతినిధి,అనకాపల్లి:


జిల్లాలోని పరవాడ మండల కేంద్రం దేశపాత్రునిపాలెం పరిధి జాజులవాణిపాలెంకు ఆనుకొని వున్న నాలుగు స్థంబాల కొండ ప్రాంతంలో నిత్యం అక్రమ గ్రావెల్ దందా యధేచ్చగా జరుగుతుంది.ఈ గ్రావెల్ మాఫియాకు మొత్తం జాజులవాణిపాలెం అక్రమ గ్రావెల్ ముఠాలను కలుపుకొని పూర్తి స్థాయిలో గడచిన 30 రోజుల్లో కొండనే మాయం చేసినట్టు అక్కడ పరిస్థితి చూస్తే అర్ధమవుతుంది. కొండనుసైతం కనీ వినీ ఎరగని రీతిలో త్రవ్వకాలు జరుపుతున్నారు.కొండకు అటు వైపు ఈదులపాకబోనంగి సర్కిల్ ఇటువైపు దేశపాత్రునిపాలెం రైల్వే రోడ్ పరిధి జగనన్న లేఔట్ కు ఆనుకొని గ్రావెల్ దందాకు మార్గం కోసం రహదారి ఏర్పాటు చేసి కొండ పై హై టెన్షన్ వైర్లు కింద తవ్వకాలు జరిపారు. పరవాడ పోలీస్ స్టేషన్ , తహసీల్దార్ కార్యాలయకు అత్యంత సమీపంలో ఈ అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు జరుగుతూ ఉండడం ఇక్కడ విశేషం.ఆయా గ్రావెల్ మాఫియా వారు సాయంత్రం అయితే చాలు దర్జాగ అక్రమ గ్రావెల్ త్రావ్వకాలు జరుపుతున్నారు. ఈ గ్రావెల్ మాఫియా ఆయా అక్రమ మట్టిని పలు కంపెనీలకు, ప్రైవేట్ లేఔట్లకు మరియు మిగతా స్వంత ప్రయోజనాలకు తరలించి సొమ్ము చేసుకుంటూన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంకు సుమారు కోట్ల రూపాయుల నష్టం వాటిల్లిందని ప్రాధమిక అంచనగా అక్కడి వారి ద్వారా తెలుస్తుంది.రాత్రిపూట పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయని భయాందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని,అక్రమ గ్రావెల్ రవాణాలో పలు వాహనాలు అత్యంత వేగంగ ప్రయాణిస్తూ ఉండడం తో స్థానికులు భయందోళనలో ఉన్నామని వాపోతున్నారు. రాత్రి 12 గంటల సమయంలో జెసిబిలతో తవ్వకాలు చేపడుతున్నారని తెలుస్తుంది. ఈ అక్రమ మైనింగ్ పై ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లేనియడల జిల్లా కలెక్టర్ కు పూర్తి ఆధారాలతో తెలియజేసి తగు చర్యలు వుండేల కృషి చేస్తామని స్థానిక పెద్దలు మరియు పలు స్వచ్చంద సంస్థలు మీడియా ముఖం గా తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article