Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుతమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి..8 మందికి తీవ్రగాయాలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి..8 మందికి తీవ్రగాయాలు

తమిళనాడులోని ధర్మపురి జిల్లా తొప్పూర్ ఘాట్‌రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వరుసగా నాలుగు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి.
తొలుత ఓ ట్రక్కు మరో ట్రక్కుపైకి దూసుకెళ్లింది. దీంతో ట్రక్కు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. ఈ క్రమంలో ఆ రెండింటి మధ్య చిక్కుకుని ఓ కారు నుజ్జునుజ్జు అయింది. వెనకనుంచి వస్తున్న మరికొన్ని వాహనాలు నియంత్రించుకోలేక అవి కూడా వాహనాలను ఢీకొట్టి బ్రిడ్జి నుంచి కిందపడ్డాయి. ప్రమాదం తర్వాత ఓ ట్రక్కులో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ప్రమాదవార్త అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article