అమరావతి:సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు. సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో ఆయన ప్రధాని మోదీతో భేటీ అవుతారు. రేపు ఉదయం ప్రధానిని జగన్ కలవనున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే. దాదాపు గంటసేపు వీరి మధ్య చర్చలు కొనసాగాయి. రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమిత్ షాను చంద్రబాబు కలవడం, మోదీని జగన్ కలవనుండటం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.