హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తున్న చిత్రం ‘పుష్ప-2: ది రూల్’. ఈ సినిమాను సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ తేదీని ప్రకటించిన మేకర్స్ పుష్ప-2 పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 6న పుష్ప-2 విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఆగస్టు 15న విడుదల అవుతుందని తొలుత చిత్ర మేకర్లు ప్రకటించారు.కొంత షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పెండింగ్ ఉన్నందున రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

