పులివెందుల టౌన్
యస్.పి సిద్దార్థ్ కౌశిల్ మేరకు పులివెందుల డి.యస్.పి వినోద్ కుమార్ ఉత్తర్వుల మేరకు, 35వ జాతీయ రోడ్డుభద్రతా వారోత్సవాల్లో భాగముగా గురువారం పట్టణంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అర్బన్ సీఐ శంకర్ రెడ్డి ఎస్సై అరుణ్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సంధర్భంగా సీఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఆటో తోలేసమయంలో యూనిఫామ్ తప్పనిసరిగా ప్రతి ఆటోకు పోలీస్ నెంబర్ ఎవరైనా అనుమానాస్పదంగా ఆటోలో ఎక్కితే పోలీసులకు ఆటోలో పరిమితిని మించి ప్యాసింజర్లను ఎక్కించుకుంటే జరిమానా తో పాటు కేసు కూడా నమోదు చేయడం ఆటో డ్రైవర్లు కచ్చితంగా లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. రూల్స్ కు వ్యతిరేకంగా ఆటోలు నడపవద్దని వారికి సూచించారు. మద్యం తాగి ఆటోలు నడిపిన జరిమానాలతో పాటు కేసు కూడా నమోదు చేయడం జరుగుతుందన్నారు