లేపాక్షి: మండల పరిధిలోని చోళ సముద్రం టోల్ గేట్లో ఎఫ్ ఎస్ టి సభ్యులు, పోలీసులు సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో మద్యం , డబ్బు అక్రమ తరలింపు పై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పూర్తిస్థాయి తనిఖీలను చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం చోళ సముద్రం టోల్ గేట్ లో వాహనాలను పూర్తిస్థాయి తనిఖీ చేపట్టారు. కోడికొండ చెక్ పోస్ట్ మీదుగా హిందూపురం వైపు వెళ్లే వాహనాలన్నింటిని పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన అనంతరం వాహనాలను వదిలి పెట్టారు.